Lifestyle: బ్లాక్‌హెడ్స్‌ ఇబ్బంది పెడుతున్నాయా.? నొప్పి లేకుండా ఇలా చెక్‌ పెట్టండి..

ముక్కుపై ఏర్పడే బ్లాక్ హెడ్స్‌ సాధారణంగా ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. ముఖమంతా తెల్లగా ఉండి ముక్కుపై నల్లటి మచ్చలు ఉంటే చూడ్డానికి బాగా కనిపించదు. దీంతో వీటిని తొలగించుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే సహజంగా కొన్ని టిప్స్‌ ద్వారా బ్లాక్ హెడ్స్‌ను సింపుల్‌గా తొలగించుకోవచ్చు...

Lifestyle: బ్లాక్‌హెడ్స్‌ ఇబ్బంది పెడుతున్నాయా.? నొప్పి లేకుండా ఇలా చెక్‌ పెట్టండి..
Blackheads

Updated on: Apr 11, 2024 | 4:13 PM

ముక్కుపై ఏర్పడే బ్లాక్ హెడ్స్‌ సాధారణంగా ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. ముఖమంతా తెల్లగా ఉండి ముక్కుపై నల్లటి మచ్చలు ఉంటే చూడ్డానికి బాగా కనిపించదు. దీంతో వీటిని తొలగించుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే సహజంగా కొన్ని టిప్స్‌ ద్వారా బ్లాక్ హెడ్స్‌ను సింపుల్‌గా తొలగించుకోవచ్చు. ఇంతకీ బ్లాక్‌ హెడ్స్‌ను నేచురల్‌గా ఎలా తొలగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఒక చెంచా తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది అలాగే నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

* ఒక చెంచా ఓట్ మీల్ పౌడర్‌లో కొద్దిగా పెరుగు లేదా తేనె కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ స్క్రబ్‌ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా కొద్ది సేపు చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి . దీంతో బ్లాక్‌ హెడ్స్‌ తొలగిపోతాయి.

* రెండు చెంచాల శెనగపిండిలో 2-3 చెంచాల రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌ను తయారు చేసుకోవాలి. దీంతో ముక్కుపై మసాజ్‌ చేసుకోవాలి. తర్వాత తర్వాత ఒక కాటన్‌ను తీసుకొని నీటిలో ముంచి శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం పొందొచ్చు.

* గ్రీన్‌ టీ ఆకులను తీసుకొని మెత్తటి పేస్ట్‌లా గ్రైడ్‌ చేసుకోవాలి. అనంతరం దీనిని ముక్కుపై అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మానికి పోషణనిస్తాయి, బ్లాక్ హెడ్స్ తగ్గించడంలో సహాయపడతాయి.

* ఆవిరి పట్టుకోవడం వల్ల కూడా ముక్కుపై మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇలా చేసిన తర్వాత ముక్కుపై నొక్కితే బ్లాక్‌ హెడ్స్‌ వచ్చేస్తాయి. అయితే ఇందుకు గోళ్లను ఉపయోగించకూడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..