National Best Friends Day 2022: జీవితంలో మనందరికీ ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు.. వారే మన స్నేహితులు.. కష్టసుఖాల్లో తోడుంటూ ముందుకు నడిపిస్తుంటారు. సొంతవాళ్లకు చెప్పుకోలేని విషయాన్నీ ఫ్రెండ్స్ కు చెప్పుకుంటాం. స్నేహితుల మధ్య నువ్వు -నేను అనే తేడాలు ఉండవు. స్నేహితులు అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, విందులు చేసుకోవడం కాదు.. జీవితాంతం తోడుంటాననే ధైర్యాన్ని కల్పించడం. ముఖ్యంగా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం. అందుకే స్నేహం ఓ వరం అంటారు పెద్దలు.. స్నేహం అనేది పలకరింపుగా కాకుండా.. ఆదర్శవంతంగా ఉన్నప్పుడే.. అది నిజమైన ఫ్రెండ్‌షిప్ గా వర్ధిల్లుతుంది. అలాంటి స్నేహమే చిరకాలం తోడుంటుంది.
స్నేహితులు మనం కుటుంబం కానప్పటికీ.. అందరి జీవితంలో వారి పాత్ర అనర్విచనీయం.. అజరామరం.. జీవితాలను నిలబెట్టడంలో వారి సహకారం, కృషి అసమానమైనది. ముఖ్యంగా బెస్ట్ ఫ్రెండ్స్ కొందరి జీవితాలను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడతారు. అలాంటి వారి మద్దతుతో, సాయంతో అనేకమంది జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగిన వారున్నారు. అలాంటి వారికి గుర్తింపుగా.. జూన్ 8న నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే వేడుకను నిర్వహిస్తారు.
నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే వేడుకను అమెరికాలో ఎక్కువగా జరుపుకుంటారు. అయినప్పటికీ.. మీరు కూడా ఈ వేడుక సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్‌కి కాల్ చేసి లేదా మెసేజ్ చేసి విష్ చేయవచ్చు. దీంతోపాటు వారికి మీ జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను, గడిపిన క్షణాలను బెస్ట్ ఫ్రెండ్స్‌కు గుర్తు చేయవచ్చు.
జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవం చరిత్ర ..
అమెరికాలోని ప్రజలు 1935లో నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డేని జరుపుకోవడం ప్రారంభించారని పేర్కొంటున్నారు. జూన్ 8న యువత వారి స్నేహితులను కలుసుకుంటారు. దీంతోపాటు ఈ రోజును సరదాగా, ఉల్లాసంగా గడుపుతూ.. అలనాటి రోజులను, క్షణాలను గుర్తు చేసుకుంటారు.
జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవం ప్రాముఖ్యత
మన జీవితంలో కొంతమంది స్నేహితులు మాత్రమే మనకు మంచి స్నేహితులు అవుతారు. అలాంటి వారికి మాత్రమే రహస్యాలను పంచుకుంటారు. అది స్నేహితుల మధ్య విడదీయరాని బంధాన్ని ఏర్పరుస్తుంది. మన జీవితంలో ఏదైనా పెద్ద లేదా చిన్న ఘటన జరిగినా.. అది మన బెస్ట్ స్నేహితులకు మాత్రమే తెలుస్తుంది. ఈ రోజు జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవం సందర్భంగా.. అలాంటి స్నేహితులకు మీరు కూడా శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.
బెస్ట్ ఫ్రెండ్స్‌కి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాలంటే.. చిరకాలం గుర్తుంచుకునేలా బహుమతులతో, చిన్నానాటి జ్ఞాపకాలతో వారిని ఆశ్చర్యపర్చవచ్చు. దీంతోపాటు సోషల్ మీడియాలో కూడా వారికి ట్యాగ్ చేసి విషెశ్ తెలపవచ్చు. అంతేకాకుండా.. ప్రత్యేకమైన రీతిలో ప్రపంచానికి చాటిచెప్పేలా వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ బెస్ట్ ఫ్రెండ్స్‌కి విష్ చేసి.. అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకోండి..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..