Breast Milk: అందుకే తల్లిపాలు ఇవ్వాల్సిందే.. మెదడు ఎదుగుదలకు తోడ్పడే మేయో-ఇనాసిటోల్ గుర్తింపు

| Edited By: Srilakshmi C

Aug 08, 2023 | 12:51 PM

తల్లిపాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్క బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకు తల్లిపాలు కచ్చితంగా అవసరం. ఈ ఆరు నెలలు తల్లిపాలు తప్ప మరొకటి ఇవ్వద్దని చెప్తుంటారు నిపుణులు. తల్లిపాల గొప్పతనం గురించి పరిశోధనలో మరో గొప్ప సంగతి బయటపడింది. తల్లిపాలలో మేయో-ఇనాసిటోల్ అనే చక్కెర పుష్కలంగా ఉంటుంది. ఇది నవజాత శిశువుల మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని టిప్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు..

Breast Milk: అందుకే తల్లిపాలు ఇవ్వాల్సిందే.. మెదడు ఎదుగుదలకు తోడ్పడే మేయో-ఇనాసిటోల్ గుర్తింపు
Breast Milk
Follow us on

Myo-Inositol in Breast Milk: ఈ మధ్యకాలంలో మహిళలు అందం తగ్గిపోతుందని పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం మానేస్తున్నారు. అలాంటి వారి పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్య పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారంటున్నారు నిపుణులు. ఎందుకంటే తల్లిపాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్క బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకు తల్లిపాలు కచ్చితంగా అవసరం. ఈ ఆరు నెలలు తల్లిపాలు తప్ప మరొకటి ఇవ్వద్దని చెప్తుంటారు నిపుణులు. తల్లిపాల గొప్పతనం గురించి పరిశోధనలో మరో గొప్ప సంగతి బయటపడింది. తల్లిపాలలో మేయో-ఇనాసిటోల్ అనే చక్కెర పుష్కలంగా ఉంటుంది. ఇది నవజాత శిశువుల మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని టిప్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

పుట్టినప్పటినుండే మెదడులోని అనుసంధానాలు ఏర్పడుతుంటాయి దానికి తోడు మెరుగుపడుతూ వస్తుంటాయి. దీనివల్ల జెన్యు పరమైన అంశాలతో పాటు, జీవితంలో ఎదురయ్యే ఎన్నో అనుభవాలుకు దారి చూపుతుంటాయి. శిశువుల్లో తల్లిపాలు ముఖ్యపాత్రను పోషిస్తాయి, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. శిశువులలో వివిధ దశలో మెదడు ఎదుగుదలను బట్టి తల్లిపాలలోని పోషకాల మోతాదులు మారిపోతుంటాయి. ఇది మరింత ఆశ్చర్యకరం. శిశువుకి జన్మనిచ్చిన తర్వాత తొలి నెలల్లో తల్లిపాలలో పెద్ద మొత్తంలో మేయో-ఇనాసిటాల్ ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ సమయంలోనే సినాప్సెస్ అంటే శిశువుల మెదడులో నాడి అనుసంధానాలు చాలావేగంగా ఏర్పడతాయి. మేయో – ఇనాసిటోల్ శిశువుల నాడుల మధ్య ఉన్న అనుసంధానాల పరిమాణం పెరగడానికి దానికి తోడు వాటి సంఖ్య పెరగడానికి తోడ్పడుతుంది. శిశువు పుట్టిన తొలినాళ్లు రక్తంలోని హాని కలిగించేవి మెదడులోకి చేరకుండా అడ్డుకునే బ్యాక్టీరియా అంత సమర్థంగా పనిచేయదు. దీనివల్ల శిశువు మెదడు ఆహారానికి చాలా ఎక్కువగా స్పందిస్తుండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఏ దశల్లో ఎంత మేయో-ఇనాసిటాల్ అవసరమనేది తేలకపోయిన, మొత్తానికి మెదడు సంపూర్ణ ఆరోగ్యానికి మంచి ఫలితాలు చూపిస్తుండటం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా శాస్త్రవేత్తల పరిశీలనతో మెరుగైన పాలపొడి తయారీకి ఈ అధ్యాయం మంచి ఫలితాలకు ఎంతో తోడ్పడతాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఇక ఇప్పుడైనా అందం గురించి ఆలోచించకుండా, పిల్లలకు తల్లి పాలు పట్టిస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మెదడుకి ఎంతో మేలు చేస్తుందని తెలుసుకోవాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.