AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morning Walk: ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేస్తే ఏమవుతుంది? లైట్‌ తీసుకుంటే మీకే నష్టం

చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో వాకింగ్‌కు వెళ్తుంటారు. ఇలా వాకింగ్‌ చేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో ఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఖాళీ కడుపుతో నడవడం సురక్షితమేనా? అనే సందేహం మీలో కూడా ఉంటే ఇక్కడ సమాధానం తెలుసుకోండి..

Morning Walk: ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్‌ చేస్తే ఏమవుతుంది? లైట్‌ తీసుకుంటే మీకే నష్టం
Morning Walk In Summer
Srilakshmi C
|

Updated on: May 06, 2026 | 9:22 PM

Share

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం తేలికపాటి వ్యాయామాలు చేయడం అవసరం. అయితే చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో వాకింగ్‌కు వెళ్తుంటారు. ఇలా వాకింగ్‌ చేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో ఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఖాళీ కడుపుతో నడవడం సురక్షితమేనా , ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ఏమిటి, ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఖాళీ కడుపుతో నడవడం సురక్షితమేనా?

నిజానికి.. ఇది వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేనివారు, డీహైడ్రేషన్‌కు గురికాని వారు ఖాళీ కడుపుతో ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లవచ్చు. అయితే ఇది అందరికీ సరిపడదు. వాకింగ్‌ సమయంలో అలసటగా, నీరసంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

మధుమేహం ఉన్నవారు ఖాళీ కడుపుతో వాకింగ్‌కు వెళ్లడం మానుకోవాలి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయి, తల తిరగడం లేదా నీరసం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి వారు ఉదయాన్నే కొద్దిగా ప్రోటీన్ తీసుకోవాలి. ఉదాహరణకు నానబెట్టిన శనగలు తిని వాకింగ్‌కు వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

వేసవిలో అదనపు జాగ్రత్త ఎందుకు అవసరం?

వేసవిలో ఎక్కువగా చెమట పడుతుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, అలసట, డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి వాకింగ్‌కు వెళ్లే ముందు పుష్కలంగా నీళ్లు తాగడం మంచిది. అలాగే ఉదయం 5 నుండి 6 గంటల మధ్య నడవడం మంచిది. ఆ తర్వాత సూర్యుని ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ ఆరోగ్యం ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంది. దీనిని వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ సమీప వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us