Morning Headache: మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా? ఇది దేనికి సంకేతమో తెల్సా..

శీతాకాలంలో చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పి వస్తుంది. ఈ నొప్పి తేలికగా ఉండవచ్చు.. లేదంటే రోజంతా ఇబ్బంది పెట్టొచ్చు! కానీ ఇలా ఉదయం పూట వచ్చే తల నొప్పిని విస్మరించకూడదు. ఎందుకంటే ఇది మీరు తినే ఆహారాల వల్ల లేదా శరీరంలో పోషకాల కొరత వల్ల సంభవించవచ్చు. శీతాకాలంలో శరీర జీవక్రియ మందగిస్తుంది..

Morning Headache: మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా? ఇది దేనికి సంకేతమో తెల్సా..
Foods For Morning Headache

Updated on: Dec 20, 2025 | 6:05 AM

శీతాకాలంలో చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పి వస్తుంది. ఈ నొప్పి తేలికగా ఉండవచ్చు.. లేదంటే రోజంతా ఇబ్బంది పెట్టొచ్చు! కానీ ఇలా ఉదయం పూట వచ్చే తల నొప్పిని విస్మరించకూడదు. ఎందుకంటే ఇది మీరు తినే ఆహారాల వల్ల లేదా శరీరంలో పోషకాల కొరత వల్ల సంభవించవచ్చు. శీతాకాలంలో శరీర జీవక్రియ మందగిస్తుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. అంతే కాదు రోజువారీ ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతి ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తే దానిని తేలికగా తీసుకోకపోవడమే బెటర్‌. ఇది మీ శరీరానికి సరైన పోషకాహారం, సమతుల్య ఆహారం అవసరమని చెప్పే సంకేతం కావచ్చు. మీకూ ఇలాంటి తలనొప్పి వస్తుందా? ఐతే దీనిని నివారించడానికి ఏ రకమైన ఆహారాలు తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి రావడానికి కారణం ఏంటంటే?

ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లోపించడం వల్ల ఇది జరుగుతుంది. ముఖ్యంగా మెగ్నీషియం లోపం వల్ల నరాల మీద ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను పెంచుతుంది. విటమిన్ బి2, బి12 లోపం కూడా ఈ సమస్యకు కారణమే. అంతే కాదు శీతాకాలంలో తక్కువగా నీరు తాగకపోవడం, ఆహారంలో ఐరన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లేకపోవడం వల్ల కూడా ఈ తలనొప్పి వస్తుంది.

తల నొప్పి నివారణకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఉదయం తలనొప్పి తగ్గాలంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తినాలి. మెగ్నీషియం కోసం బాదం, గుమ్మడికాయ గింజలు, పాలకూర, అరటిపండ్లు తిపాలి. ఇవి నరాలను సడలించి నొప్పిని తగ్గిస్తాయి. విటమిన్లు బి12, బి2 కోసం గుడ్లు, పాలు, పెరుగు, తృణధాన్యాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రకమైన ఆహారాలు మెదడుకు శక్తిని అందిస్తాయి. ఉదయం పూట కనిపించే బద్ధకాన్ని కూడా తగ్గిస్తాయి. ఇనుము కోసం పాలకూర, బెల్లం, చిక్‌పీస్, పప్పు ధాన్యాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి రక్తంలో సరైన ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల కోసం వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా గింజలు అద్భుతమైన ఎంపికలు. ఈ ఆహారాలు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. తలనొప్పిని నియంత్రించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.