చాలా మందికి రాత్రుల్లో సరిగ్గా నిద్ర పట్టదు. నిద్ర సరిగ్గా లేకపోవడానికి అనేక కారణాలుంటాయి. అయితే చాలా దేశాల్లో సరైన నిద్ర కోసం రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగుతుంటారు. ఇలా గోరువెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుందని, అంతేకాకుండా పొట్టను సైతం శుభ్రంగా ఉంచుతుందని కొందరు చెబుతుంటారు. రాత్రి సమయంలో నిద్ర బాగా పోయేందుకు గోరువెచ్చని పాలు తాగుతుంటారు. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. గతంలో బీబీసీకి చెందిన సైన్స్ ఫోకస్ అనే మ్యాగజైన్ నివేదిక ప్రకారం.. వేడి పాలతో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పాలలో ప్రత్యేకమైన ప్రోటీన్స్ ఉంటుంది. దీనిని ఆల్ఫా-లాక్టాల్బుమిన్ అని పిలుస్తారు. ఇది అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్ మూలం. ఇది శరీరానికి చేరుతుంటుంది. సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ న్యూరోట్రాన్స్మిటర్ ఒక వ్యక్తి మానసిక స్థితి, నిద్రకు ఉపయోగపడుతుంది. శరీరంలో ఆల్ఫా-లాక్టాల్‌బుమిన్‌కు చేరుకున్న తర్వాత రక్తంలో అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో రాత్రి సమయంలో సరైన నిద్రపోయేందుకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఒత్తిడిని తగ్గించడానికి పాలలో అనేక మూలకాలు కూడా ఉన్నాయి. ఇలా గోరువెచ్చని పాలు తాగడం వల్ల వ్యక్తి మానసికంగా రిలాక్స్ అవుతాడు.
మనిషికి వేడి పాలు ఎలా పని చేస్తాయో తెలుసుకోవడానికి నెదర్లాండ్స్‌లోని 15 మంది మహిళలపై పరిశోధన జరిగింది. ఈ మహిళలందరూ నిద్రలేమితో బాధపడుతున్నవారే. పాలు తాగిన తర్వాత వారి నిద్ర మెరుగుపడిందని పరిశోధనలో వెల్లడైంది. పాలలో మెగ్నీషియం, ప్రొటీన్ కెసైన్ హైడ్రోలైజేట్ తగినంతగా ఉన్నప్పుడు నిద్ర మెరుగుపడుతుందని నివేదిక చెబుతోంది.
పాలు బరువు పెరగకుండా కూడా ఉపయోగపడతాయని హెల్త్‌లైన్ నివేదిక చెబుతోంది.1800 మంది మహిళలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాలు తాగే మహిళల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని గుర్తించారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి