Beauty Tips: పురుషుల ముఖారవిందం కోసం.. ఈ చిట్కాలను పాటించండి..

|

Mar 04, 2022 | 8:30 AM

Beauty Tips: శుభ్రమైన, అందమైన చర్మం మహిళలకు మాత్రమే కాదు.. పురుషులకు కూడా అవసరమే. స్త్రీల మాదిరిగానే పురుషులు

Beauty Tips: పురుషుల ముఖారవిందం కోసం.. ఈ చిట్కాలను పాటించండి..
Skin Care
Follow us on

Beauty Tips: శుభ్రమైన, అందమైన చర్మం మహిళలకు మాత్రమే కాదు.. పురుషులకు కూడా అవసరమే. స్త్రీల మాదిరిగానే పురుషులు కూడా తమ చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పురుషులు తమ చర్మాన్ని సంరక్షించుకోకపోతే చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. సాధారణంగా అయితే, స్త్రీలు తమ చర్మంపై ప్రత్యేక వహిస్తారు. కానీ పురుషులు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు, ప్రత్యేక చర్యలు తీసుకోరు. అయితే.. స్త్రీలు, పురుషుల చర్మం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కారణంగానే స్త్రీ, పురుషుల చర్మ సంరక్షణ చర్యల్లో ప్రత్యేక విధానాలు ఉంటాయి. పురుషులు తమ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల తరచుగా చర్మంపై మచ్చలు, మొటిమలు, బ్లాక్ హెడ్స్, ముడతలు వస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి.. కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది. ఈ చిట్కాలను అనుసరించడం వల్ల మీ ముఖం ఆకర్షణీయంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

క్లెన్సింగ్..
క్లెన్సింగ్ అనేది చర్మ సంరక్షణ దినచర్యలో చాలా ముఖ్యమైన భాగం. క్లెన్సింగ్ రోజంతా చర్మం నుండి మురికిని తొలగించడానికి సహాయపడుతుంది. వారానికి ఒకసారి మీ చర్మాన్ని మంచి స్క్రబ్‌తో ఎక్స్‌ఫోలియేట్ చేయడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

షేవింగ్ చిట్కాలు..
షేవింగ్ చేయడానికి ముందు షేవింగ్ జెల్ ఉపయోగించండి. ఇది సబ్బు కంటే మెరుగైనది. షేవ్ అనంతరం చర్మానికి తేమను అందించడానికి ఆఫ్టర్ షేవ్ క్రీమ్‌ను అప్లై చేయాలి. వీలైతే ఆల్కహాల్ ఆధారిత ఆఫ్టర్ షేవ్‌లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

సన్‌స్క్రీన్..
సన్‌స్క్రీన్ సాధారణ రోజువారీ వినియోగాల్లో ఒకటి. UV కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌ని ఉపయోగించవచ్చు. ఎండలో బయటకు వెళ్లే 10 నిమిషాల ముందు ముఖం, మెడపై సన్‌స్క్రీన్ రాసుకోండి. అలాగే మీ చర్మ రకాన్ని బట్టి బ్యూటీ క్రీమ్స్‌ని ఎంచుకోండి. పురుషులు సాధారణంగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల గురించి పట్టించుకోరు. అయితే, ఇది చర్మ సమస్యలను కలిగిస్తుంది. మొటిమలు, చర్మ సమస్యలను నివారించడానికి మీ చర్మ రకాన్ని బట్టి కస్మొటిక్స్ సెలక్ట్ చేసుకోండి.

ఆహారం..
ఆరోగ్యకరమైన చర్మానికి ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం. ఇది చర్మానికి లోతుగా పోషణను అందించడంలో సహాయపడుతుంది. మెరిసే చర్మం కోసం మీరు ఇంట్లో తయారుచేసిన వివిధ రకాల ఫేస్ మాస్క్‌లను కూడా ఉపయోగించవచ్చు.

Also read:

Parenting Tips: మీ పిల్లలు ఎక్కువ సమయం టీవీ చూస్తున్నారా ? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

Puttaparthi: ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆగాలని.. ప్రపంచ శాంతి కోరుతూ విదేశీయులు పుట్టపర్తిలో ప్రత్యేక హోమం

NSE IFSC: అమెరికా కంపెనీల షేర్లు కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ లాంటి ఇన్వెస్టర్లకే..