కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972లో మహిళాఎం IPSలో చేరి తొలి మహిళా అధికారిణిగా రికార్డ్ నెలకొల్పారు. కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది.2003లో ఐక్యరాజ్య సమితికి సివిల్ పోలీస్ సలహాదారుగా నియమించబడ్డారు. ఇందులో తొలి మహిళగా కిరణ్ బేడీనే నిలిచారు.