Lifestyle: అస్సలు ఆకలి వేయడం లేదా.? ఈ సమస్య కావొచ్చు..

|

Mar 28, 2024 | 2:44 PM

కిడ్నీలు శరీరంలో ఎంత కీలకమైన అవయవమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో వీటి పాత్ర కీలకమైంది. అయితే కిడ్నీల పనితీరులో ఏదైనా సమస్య ఉంటే వెంటనే కొన్ని లక్షణాల ద్వారా తెలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అందులో ఆకలిలేమి కూడా ఒకటని చెబుతున్నారు. ఆకలి లేకపోవడాన్ని అనోరెక్సియా అని పిలుస్తారు...

Lifestyle: అస్సలు ఆకలి వేయడం లేదా.? ఈ సమస్య కావొచ్చు..
Health
Follow us on

మన శరీరంలో జరిగే ప్రతీ మార్పు మనకు ఏదో ఒక సంకేతాన్ని ఇస్తూనే ఉంటుంది. ముఖ్యంగా కొన్ని లక్షణాలు మన ఆరోగ్య పరిస్థితిని సూచిస్తుంటాయి. వీటిని ముందుగా గుర్తిస్తే అనారోగ్య సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తుంది. అలాంటి వాటిలో ఆకలి లేకపోవడం కూడా ఒకటి. ఇది సర్వసాధారణంగా మనలో చాలా మందికి ఎదురైన అనుభవమే. అయితే ఆకలిలేమి కిడ్నీ సంబంధిత సమస్యకు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆకలికి, కిడ్నీలకు మధ్య సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కిడ్నీలు శరీరంలో ఎంత కీలకమైన అవయవమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో వీటి పాత్ర కీలకమైంది. అయితే కిడ్నీల పనితీరులో ఏదైనా సమస్య ఉంటే వెంటనే కొన్ని లక్షణాల ద్వారా తెలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అందులో ఆకలిలేమి కూడా ఒకటని చెబుతున్నారు. ఆకలి లేకపోవడాన్ని అనోరెక్సియా అని పిలుస్తారు. ఇవి కిడ్నీల పనితీరు దెబ్బతినడానికి ప్రాథమిక లక్షణంగా చెబుతారు.

కిడ్నీ సంబంధిత సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడే వారిలో మూడింట ఒక వంతు మంది ఆకలి లేదని చెబుతుంటారు. మూత్ర విసర్జనలో ఇబ్బందితోపాటు ఆకలి మందగిస్తే మాత్రం కచ్చితంగా కిడ్నీ సంబంధిత సమస్యగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో సమస్య ఉన్నప్పుడు ఆకలి తగ్గడం ప్రారంభమవుతుంది. శరీరంలోని విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్‌ కోల్పోవడం కూడా ఆకలి వేయకపోవడానికి కారణంగా చెబుతున్నారు. కాబట్టి దీర్ఘకాలికంగా ఆకలిలేమి సమస్య వెంటాడితే మాత్రం వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఆకలి లేమి కేవలం కిడ్నీ సంబంధిత సమస్యకు మాత్రమే కాకుండా మరికొన్ని వ్యాధులకు కూడా సూచనగా నిపుణులు చెబుతున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు, ఉబ్బసం, మధుమేహం, రక్తంలో కాల్షియం స్థాయిలు పెరగడం వంటివి కూడా ఆకలిలేమికి దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..