Korean Glass Skin : కొరియన్ అమ్మాయిల్లా.. మచ్చ లేని చందమామలా కనిపించాలంటే జస్ట్ ఈ టిప్స్ పాటించండి..

| Edited By: Anil kumar poka

Feb 27, 2023 | 12:37 PM

కొరియన్ అమ్మాయిలు చూసేందుకు బుట్ట బొమ్మల్లా మెరిసిపోతుంటారు. ముఖ్యంగా వారి స్కిన్ కాంప్లెక్సేషన్ చాలా ఫెయిర్ గా ఉంటుంది.

Korean Glass Skin : కొరియన్ అమ్మాయిల్లా.. మచ్చ లేని చందమామలా కనిపించాలంటే జస్ట్ ఈ టిప్స్ పాటించండి..
Korean Glass Skin
Follow us on

కొరియన్ అమ్మాయిలు చూసేందుకు బుట్ట బొమ్మల్లా మెరిసిపోతుంటారు. ముఖ్యంగా వారి స్కిన్ కాంప్లెక్సేషన్ చాలా ఫెయిర్ గా ఉంటుంది. అయితే జన్మతహ వారికి స్కిన్ టోన్ అలా ఉన్నప్పటికీ, కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారి చర్మం తళ తళా మెరవడం మనం గమనించవచ్చు. దీని వెనుక కొరియన్ మేకప్ టెక్నిక్స్, బ్యూటీ సీక్రెట్స్ ఉన్నాయి. అవేంటో ఇఫ్పుడు తెలుసుకుందాం.

మీ చర్మాన్ని మసాజ్ చేయండి:

మీ ముఖానికి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సర్కిల్ మోషన్‌లో మీ చర్మాన్ని మసాజ్ చేయండి. క్లెన్సర్ లేదా మాయిశ్చరైజర్‌ అప్లై చేసేటప్పుడు, మీ చర్మాన్ని మసాజ్ చేయాలి. మీ మసాజ్ సున్నితంగా ఉండాలని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

క్లెన్సింగ్ మిల్క్ తో చర్మాన్ని శుభ్రపరచండి:

మేకప్, సన్‌స్క్రీన్, చెమట, ధూళి వంటి మలినాలను తొలగించడానికి క్లెన్సర్‌ని ఉపయోగించండి. మీ చర్మాన్ని క్లెన్సర్ తో రెండుసార్లు శుభ్రపరచడం మంచిది.

తడి వాష్‌క్లాత్‌తో ఎక్స్‌ఫోలియేట్ చేయండి:

మురికి, డెడ్ స్కిన్ కణాలు, ధూళిని తొలగించడానికి తడిగా ఉన్న వాష్‌క్లాత్‌ను ఉపయోగించండి. అయితే వెచ్చని వాష్‌క్లాత్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది ఉత్పత్తి లోపలికి ప్రవేశించడానికి రంధ్రాలను తెరుస్తుంది.

షీట్ మాస్క్‌లు:

కొరియన్ బ్యూటీ సీక్రెట్స్ లో చర్మ సంరక్షణ కోసం షీట్ మాస్క్‌లు వాడటం చాలా అవసరం. ఈ మాస్క్‌లు చార్ కోల్, జిన్సెంగ్, గ్రీన్ టీ లాంటి పదార్థాలతో తయారు చేసి ఉంటాయి.

టోనర్‌ని అప్లై చేయండి:

మురికిని సరిగ్గా తొలగించిన తర్వాత, మీ చర్మం pH స్థాయిని సమతుల్యంగా ఉంచడానికి టోనర్‌ని అప్లై చేయండి. ఇది ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తులు సరిగ్గా చర్మానికి అప్లై అయ్యేలా చేస్తుంది.

ఎస్సెన్స్ వాడండి:

ఎసెన్స్ చర్మ కణాలను హైడ్రేట్ చేస్తాయి. మొఖం హైడ్రేట్ అవుతుంది. అనంతరం ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తుల కోసం దీనిని సిద్ధం చేస్తుంది.

సీరమ్‌ను వాడండి:

మీచర్మ సమస్యల నివారణకు సీరమ్‌ను వాడటం చాలా అవసరం. సీరం నల్ల మచ్చలు, ముడతలు, హైపర్‌పిగ్మెంటేషన్ వంటి సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సొల్యూషన్.

ఐ క్రీమ్ అప్లై చేయండి:

మన కళ్ల కింద ఉన్న చర్మం మన ముఖంలోని మిగిలిన భాగాల కంటే చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే ఐ క్రీమ్స్ వాడాలి. తద్వారా ప్రత్యేకంగా రోజంతా కళ్లను హైడ్రేట్ గా ఉంచడానికి, రక్షించడానికి ఉపయోగించుకోవచ్చు.

మాయిశ్చరైజర్‌ వాడండి :

ముఖం మెరవాలంటే మాయిశ్చరైజర్‌ని వాడండి. మీ చర్మానికి సరిపోయే మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి. ఉదాహరణకు, మీకు పొడి చర్మం ఉన్నట్లయితే, క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి, జిడ్డు చర్మం ఉంటే, మీరు నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం