AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lip Care: లిప్‌స్టిక్‌.. లిప్‌గ్లాస్‌.. లిప్‌బామ్.. ఏది మీ పెదాలకు మంచిదో తేల్చుకోలేకపోతున్నారా?

కొందరు పెదవుల సంరక్షణను సరిగ్గా పట్టించుకోరు. దీంతో పెదాలపై నల్లని ట్యాన్‌ పేరుకుపోయి పాలిపోయి గరుకుగా మారుతాయి. అయితే పెదవులను అందంగా ఉంచుకోవడానికి వాటి రక్షణ కోసం లిప్ బామ్, లిప్ స్టిక్, లిప్ గ్లాస్‌లను ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. ఈ మూడు సౌందర్య సాధనాలు..

Lip Care: లిప్‌స్టిక్‌.. లిప్‌గ్లాస్‌.. లిప్‌బామ్.. ఏది మీ పెదాలకు మంచిదో తేల్చుకోలేకపోతున్నారా?
ఇక మన శరీరంలో మరికొన్ని అవయవాలు ఉన్నప్పటికీ అవి మన కళ్లకు కనిపించవు. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, కడుపు మొదలైనవి. సాధారణంగా మన శరీరంలోని చాలా భాగాల పేర్లు మనకు తెలుసు. కానీ మన శరీరంలో కొన్ని అవయవాల పేర్లు సాధారణంగా వినికిడిలో ఉండవు.
Srilakshmi C
|

Updated on: Jul 28, 2025 | 9:14 PM

Share

గులాబీ రంగు కలగలిసిన మృదువైన పెదవులు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి..? కానీ కొందరు పెదవుల సంరక్షణను సరిగ్గా పట్టించుకోరు. దీంతో పెదాలపై నల్లని ట్యాన్‌ పేరుకుపోయి పాలిపోయి గరుకుగా మారుతాయి. అయితే పెదవులను అందంగా ఉంచుకోవడానికి వాటి రక్షణ కోసం లిప్ బామ్, లిప్ స్టిక్, లిప్ గ్లాస్‌లను ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. ఈ మూడు సౌందర్య సాధనాలు పెదవుల సంరక్షణకు చాలా అవసరం. అయితే ప్రతి ఒక్కటి వేర్వేరు విధులను కలిగి ఉంటుంది. అందుకే మీ పెదవుల రకం, అవసరాలకు అనుగుణంగా సరైనదాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..

లిప్ బామ్

పగిలిన, పొడిబారిన పెదవులకు లిప్ బామ్ అనువైనది. పొడి, పగిలిన, సున్నితమైన లేదా గరుకుగా ఉండే పెదవులు ఉన్నవారు లిప్ బామ్ ఉపయోగించవచ్చు. లిప్ బామ్ ప్రాథమికంగా పెదవులను హైడ్రేట్ చేస్తుంది. తేమగా ఉంచుతుంది. ఇది సాధారణంగా షియా బటర్, బీస్వాక్స్, కలబంద, విటమిన్ E వంటి పలు పదార్థాలను కలిగి ఉంటుంది. ఇవి పెదవులను నయం చేస్తాయి. శీతాకాలంలో లేదా రోజంతా ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో నివసించే వారికి రెగ్యులర్ లిప్ బామ్ చాలా అవసరం. పెదవులపై రంగు మీకు నచ్చకపోతే రంగులేని లేదా లేత రంగు లిప్ బామ్‌ను ఉపయోగించవచ్చు.

లిప్ స్టిక్

లిప్ స్టిక్ ప్రధానంగా పెదాలను మరింత ఆకర్షణీయంగా, అందంగా మార్చడానికి ఉపయోగిస్తారు. అయితే పెదవులు ఇప్పటికే బాగున్న వారికి లిప్ స్టిక్ ప్రయోజనకరంగా ఉంటుంది. లిప్ స్టిక్ ప్రాథమికంగా పెదవులకు రంగు, గ్లామర్, వ్యక్తీకరణను జోడిస్తుంది. మీరు మీ ఎంపిక ప్రకారం మ్యాట్, క్రీమీ, శాటిన్ ఫినిష్ లిప్ స్టిక్‌లను ఉపయోగించవచ్చు. ఈవెంట్‌లో అయినా, ఆఫీసులో అయినా, ఫ్యాషన్ షోలో అయినా అద్భుతమైన లుక్ సాధించడానికి లిప్ స్టిక్ చాలా అవసరం. అయితే మ్యాట్ లిప్ స్టిక్ ఉపయోగించే ముందు లిప్ బామ్ అప్లై చేయడం ముఖ్యం. లేకుంటే పెదవులు మరింత పొడిగా మారవచ్చు.

ఇవి కూడా చదవండి

లిప్ గ్లాస్

లేత రంగులు, మెరిసే పెదాలను ఇష్టపడే వారికి లిప్ గ్లాస్ అనుకూలంగా ఉంటుంది. గరుకుగా లేని అంటే.. మృదువైన పెదవులకు లిప్ గ్లాస్ అనుకూలంగా ఉంటుంది. లిప్ గ్లాస్ పెదవులకు లేత రంగు నిగనిగలాడే ప్రభావాన్ని ఇస్తుంది. ఇది పెదవులను నిండుగా, మృదువుగా, మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. లిప్ గ్లాస్ మీ లుక్‌కు ఎక్కువ మెరుపును జోడిస్తుంది. మరింత మెరుపు కోసం లిప్‌స్టిక్‌పై లిప్ గ్లాస్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఎక్కువ గ్లాస్ వాడటం వల్ల పెదవులు జిడ్డుగా కనిపిస్తాయనే విషయం గుర్తుంచుకోండి. అందుకే వీలైనంత తక్కువగా వాడాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.