Skin Tight Jeans: స్కిన్ టైట్‌ జీన్స్ తో కొత్త సిండ్రోమ్.. ప్రాణాల మీదకు వస్తుందని వైద్యుల హెచ్చరిక

| Edited By: Janardhan Veluru

Jul 01, 2022 | 2:55 PM

చాలా విషయాలు.. మనకు అనుభవం అయితే తప్ప నమ్మలేం. అలాంటిదే స్కిన్ టైట్ జీన్ దుస్తుల వ్యవహారం కూడా. ఇదిగో ఈ న్యూస్ ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఈ డేంజర్.

Skin Tight Jeans: స్కిన్ టైట్‌ జీన్స్ తో కొత్త సిండ్రోమ్.. ప్రాణాల మీదకు వస్తుందని వైద్యుల హెచ్చరిక
Skin Tight Jeans
Follow us on

Skin Tight Jeans Side Effects: స్కిన్ టైట్ లు.. ప్రాణాల మీదకు తెస్తాయా? టైట్ జీన్స్.. జీవితాలకు ఫుల్ స్టాప్ పెడతాయా? చిన్న చిన్న సమస్యలు కాదు.. అనారోగ్యంతో ఏకంగా ఇంటెన్సివ్ కేర్ లకు వెళ్లే పరిస్థితులు ఏర్పడతాయా? మరోవైపు ఆందోళన కలిగించే సిండ్రోమ్స్ వెంటాడతాయా? అవుననే హెచ్చరికలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఇంతకీ… స్కిన్ టైట్ జీన్స్ ఏలా ప్రమాదకరంగా మారుతున్నాయి? ఎలా ప్రాణామీదకు తెస్తున్నాయో తెలుసుకుంటే.. స్కిన్ టైట్‌ జీన్స్ చూసి భయపడాల్సిందే. సెప్సిస్‌, సెల్యులైటీస్‌ అనే ఇన్ఫెక్షన్ లు తో పాటు టింగింగ్ థై సిండ్రోమ్ వెంటాడుతోంది.

చాలా విషయాలు.. మనకు అనుభవం అయితే తప్ప నమ్మలేం. అలాంటిదే స్కిన్ టైట్ జీన్ దుస్తుల వ్యవహారం కూడా. ఇదిగో ఈ న్యూస్ ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఈ డేంజర్. టైట్‌ జీన్సే.. ఫ్యాషన్‌ ఐకాన్‌! ప్రపంచవ్యాప్తంగా కాలేజ్‌ గర్ల్స్‌ నుంచి అమ్మ వయస్సు దాటినా క్యాజువల్‌ డ్రెస్సింగ్‌లో జీన్స్‌ భాగమైపోయింది. కానీ గంటల తరబడి జీన్స్‌ ధరిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. కొంతకాలం క్రితం ఒక మహిళ 8 గంటల పాటు జీన్స్‌ ధరించినందుకు.. ఐసీయూలో 4 రోజులపాటు చికిత్స తీసుకున్న అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో బిగ్ టాక్‌ గా మారింది. నార్త్‌ కరోలినాకి చెందిన 25 ఏళ్ల సామ్‌ అనే యువతి… తన బాయ్‌ ఫ్రెండ్‌ కోరిక మేరకు బిగుతుగా ఉండే షార్ట్ జీన్స్ వేసుకుంది. 8 గంటల తర్వాత ఇంటికి చేరిన సామ్‌కు నడుము క్రింద నొప్పి ప్రారంభమైంది. ఆ మరుసటి రోజు డాక్టర్‌ని సంప్రదించడంతో సెప్సిస్‌, సెల్యులైటీస్‌ అనే ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఇంటెన్సివ్ కేర్ కు వెళ్ళా ల్సి వచ్చింది.

అయితే… స్కిన్ టైట్… జీన్స్ ఫ్యాషన్ ఇప్పుడు రాజ్యమేలుతోంది. ఎక్కడ ఏ షాపులో చూసినా స్కిన్‌ టైట్ ఫేషన్లు కుప్పలు తెప్పలుగా కన్పిస్తున్నాయి. ప్రత్యేకంగా మహిళలు, యువతులు… ఈ మధ్యకాలంలో స్కిన్‌ టైట్‌.. స్లెక్సిబుల్ జీన్స్ వైపు పరుగులు తీస్తున్నారు. వారి నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో… ఒకవైపు డిజైనర్లు.. షాపులు.. వీటి అమ్మకాలుపై నే దృష్టిపెట్టాయి.

ఇవి కూడా చదవండి

ఇలా… స్కిన్ టైట్‌ జీన్స్ గంటల తరబడి వేసుకోవడం వల్ల సెప్సిస్‌, సెల్యులైటీస్‌ అనే ఇన్ఫెక్షన్ లే కాదు… టింగింగ్ థై సిండ్రోమ్ కూడా వెంటాడుతోంది. స్కిన్ టైట్… జీన్స్ ఫ్యాషన్ లు… ఒక హద్దు వరకే… అది శ్రుతి మించితే… అరుదైన రోగాలను ఆహ్వానించినట్లే. సెల్యులైటీస్ లాంటి రోగాలు వచ్చి..అవి చివరకు సెప్సిస్ లాంటి రోగాలకు దారితీస్తాయంటున్నారు వైద్యులు. ఈ వ్యాధుల వల్ల కళ్ళ నుంచి చివరకు బాడీ అంతా ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయని హెచ్చరిస్తున్నారు ప్రముఖ వ్యాస్క్యులర్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రాజు.

Jeans

మనం ఫ్యాషన్ మోజులో పడి శరీరాన్ని పట్టించుకోవడం లేదు. ఊబకాయం ఉన్నవారు లేదా సన్నగావున్నా ..బిగుతైన దుస్తులు ధరించడం వల్ల నడుము నుంచి కింది భాగం లో నరాలు లెగ్ మెంట్స్కు డామేజ్ జరిగి అవి రోగాలుగా మారతాయని న్యూరాలజిస్టు లు హెచ్చరిస్తున్నారు. ఏవిధంగా డ్యామేజ్ జరుగుతుందో వివరిస్తున్నారు న్యూరో సర్జన్ డాక్టర్ అనీల్ కుమార్.

టైట్ గా ఉండే బట్టలు వేసునప్పుడు చర్మం కోతకు గురై ఇన్‌ఫెక్షన్‌ కలిగించే బ్యాక్టీరియా తేమలాంటి పదార్థంలా పేరుకుపోతుంది. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే, ఆ ప్రదేశంలో చర్మగ్రంధులు మూసుకుపోయి ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌గా మారుతుందనీ సాధారణంగా ఇమ్యునిటీ బలహీణంగా ఉండే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు.టైట్ బట్టలు వేసుకొవడం వల్ల సెప్సిస్‌, సెల్యులైటీస్‌ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ సోకుతుందని.. ఈ ఇన్ఫెక్షన్ తీవ్రమైతే అలర్జీ వల్ల రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించి, అన్ని అవయవాలకు ఇన్ఫెక్షన్ జరుగుతుందని, దీని వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం లేక పోలేదని వైద్యులు అంటున్నారు స్కిన్‌ స్పెషలిస్ట్ డాక్టర సుకృత.

మన శరీర నిర్మాణంలో దేనికి ఇబ్బంది కలిగినా ..అది మనకు ఇబ్బంది కలిగిస్తుంది. చివారికి చర్మ గ్రంధులకు ఇబ్బంది కలిగినా దాని పర్యవసానం తిరిగి చూపిస్తుంది. ఇలా పట్టించుకోకుండా స్కిన్ టైట్ ఫ్యాషన్ లకు పోతే..సెల్యులైటీస్ లాంటి పరిణామాలు వల్ల.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. మరోవైపు టింగింగ్ థై సిండ్రోమ్ ముప్పు వల్ల మరిన్ని కొత్త సమస్యలు వెంటాడతాయంటున్నారు.

ఏదైనా..అతి, ప్రమాదకరమే. అది ఆహారమైనా .. ఫేషన్‌ దుస్తులైనా. ఇప్పుడు కంఫర్ట్ నుంచి అతిగా మారిన జీన్స్..కూడా ప్రాణాల మీదకు తెస్తున్నాయి. బీకేర్….స్కిన్ టైట్ జీన్స్ అని హెచ్చరిస్తున్నాయి.

(గణేష్‌. వై, టివి9 తెలుగు, హైదరాబాద్‌)