నేటి కాలంలో చాలా మంది ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు తాజా ఆహారాన్ని మాత్రమే తినేందుకు ఇష్టపడుతుంటారు. మిగిలిపోయిన ఆహారం, రాత్రి చేసిన కూరలు, రోటీలు వంటివి ఏవైనా సరే పక్కన పెడుతుంటారు. ఎక్కువగా వేడిగా ఉన్న ఆహారం, తాజా పండ్లు మాత్రమే తినేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. కానీ రాత్రి మిగిలిపోయిన రోటీలతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి చేసిన చపాతీలు మిగిలిపోతే ఉదయాన్నే వాటిని ఆల్పాహారంగా తీసుకోవచ్చని చెబుతున్నారు.
ముఖ్యంగా మధుమేహం, జీర్ణక్రియకు సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ బాధితులకు ఇలాంటి చద్ది చపాతీలు తమ డైట్లో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఆ చపాతీలను టీ లేదా ఏదైనా మంచి సలాడ్స్ , కూరలతో తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్ కు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. రాత్రి చేసిన చపాతీలు, ఉదయం కాగానే పోషకాలు లేకుండా మారిపోవాని…వాటిలో కూడా పోషకాలు అలాగే ఉంటాయనీ అందుకే వాటిని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా రోటీ కంటే మిగిలిన రోటీ మంచిదా?
గోధుమలు ప్రపంచంలోని అత్యంత సాధారణ తృణధాన్యాలలో ఒకటి. ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది కార్బోహైడ్రేట్ల మంచి మూలం. అంతేకాదు శక్తినిచ్చే ఆహారం. మొత్తం గోధుమ పిండి గ్లైసెమిక్ ఇండెక్స్‌లో మితంగా, అధిక స్థాయిలో ఉంటుంది. గ్లైసెమిక్ లోడ్, కానీ ఇది కరగని ఫైబర్ కు మంచి మూలం. ఇది భోజనానంతర రక్త ప్రతిస్పందనను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇది ఆరోగ్యకరమైన గట్ మైక్రో బయోటాను పెంచుతుంది. రెసిస్టెంట్ స్టార్చ్ మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హైబీపీతో బాధపడేవారు ఈ చపాతీలను పదినిమిషాలపాటు గోరువెచ్చనిపాలల్లో నానబెట్టి తినడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది. జీర్ణ సమస్యలు, ఎసిడిటి, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాలల్లో చపాతీలను నానబెట్టి తినడం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
కాగా ఈ రోటీల్లో గ్లూకోజ్ పరిమాణం కూడా తగ్గుతుంది. పాలతో తింటే చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటుంది. పిల్లలు సన్నగా ఉంటే బరువు పెరిగేందుకు రాత్రి మిగిలిపోయిన రోటీలను తినడం అలవాటు చేయాలి. ఉదయం అల్పాహారంలో వీటిని పాలలో వేసుకుని తినడం వల్ల మీరు ఆరోగ్యం మెరుగవుతుంది. రాత్రి మిగిలిపోయిన చపాతీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది వీటిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది. వేసవిలో చల్లటిపాలతో ఈ రోటీని తిన్నట్లయితే శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. శరీరంలో వేడి ప్రభావం ఉండదు. ఎసిడిటి సమస్యలు రావు. మజ్జిగతోకానీ లస్సీతో కానీ తింటే ఇంకా మేలు జరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉండటంతోపాటు చల్లటి పాలతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో తినేవారు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..