
ఎవరైనా సహాయం అడిగినప్పుడు లేదా ఏదైనా చేయమని అడిగినప్పుడు మనలో చాలా మంది వద్దు అనలేక తల ఊపుతారు. ఎందుకంటే ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అని భయపడతారు లేదా వారు తమ గురించి ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు. అదే విధంగా ప్రతిదానికీ “అవును” అని చెప్పినా మీరు చేసిన పనిని ఎవరైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ప్రతిదానికీ “అవును” అని చెప్పే ఈ అలవాటుతో లేని సమస్యలను కొని తెచ్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. అయితే పనిలో అయినా లేదా మన వ్యక్తిగత జీవితంలో అయినా ఎవరైనా ఏమి చెప్పినా “వద్దు” అని చెప్పాల్సిన సందర్భాలు ఉంటాయి . “వద్దు” అని చెప్పే అలవాటును పెంపొందించుకోవడం ఎందుకు చాలా ముఖ్యమో ఈ రోజు తెలుసుకుందాం..
నో చెప్పే అలవాటును పెంపొందించుకోవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరగడమే కాదు ఇతరులు మిమ్మల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా నిరోధిస్తుంది. అందుకే “నో” చెప్పడం చాలా ముఖ్యం.
మీ విలువను పెంచుతుంది: ప్రతిదానికీ అవును అని చెప్పడం మంచి అలవాటు కాదు. మీ సౌలభ్యం ప్రకారం కొన్ని సందర్భాల్లో నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఇది మీ విలువను, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.
మీరు ఒత్తిడిని నివారించవచ్చు: మీకు తగినంత పని ఉన్నప్పుడు.. ఈ లోగా ఎవరైనా వచ్చి నా కోసం ఈ పని చేయగలరా అని అడిగితే మీరు అవును అని చెబితే.. మీకు ఒత్తిడి పెరుగుతుంది. కనుక ఎవరు అడిగినా లేదు అని చెప్పండి. ఇది మీ పని ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
ఆత్మవిశ్వాసం: ప్రతిదానికీ అవును లేదా కాదు అని చెప్పడం కాదు. కొన్ని సందర్భాల్లో కాదు అని చెప్పడం నేర్చుకోండి. మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ఆరోగ్యకరమైన సరిహద్దులు: స్పష్టంగా నో చెప్పడం వల్ల ఇతరులు మీ సరిహద్దులను గౌరవిస్తారు. ఇది మీ కోసం జీవించే అవకాశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఇతరులు మిమ్మల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా నిరోధిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)