Heart Attack: గుండెపోటు రాకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి..! లేదంటే చాలా కష్టం..

|

Sep 06, 2021 | 11:50 AM

Heart Attack: ఇటీవల నటుడు సిద్ధార్థ్ శుక్లా మృతి అందరిని కలచివేసింది. 40 సంవత్సరాల వయసులో సిద్ధార్థ్ గుండెపోటుతో మరణించాడు. ఇటీవల కాలంలో చాలా

Heart Attack: గుండెపోటు రాకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి..! లేదంటే చాలా కష్టం..
Heart Attack
Follow us on

Heart Attack: ఇటీవల నటుడు సిద్ధార్థ్ శుక్లా మృతి అందరిని కలచివేసింది. 40 సంవత్సరాల వయసులో సిద్ధార్థ్ గుండెపోటుతో మరణించాడు. ఇటీవల కాలంలో చాలా తక్కువ వయసున్నవారు గుండెపోటుకు గురవుతున్నారు. గణాంకాల ప్రకారం.. భారతదేశంలో ప్రతి 4 మరణాలలో ఒకరు హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. 80 శాతం కేసులకు గుండెపోటే కారణం. ఆశ్చర్యకరంగా 40 నుంచి 55 ఏళ్ల వ్యక్తులే ఎక్కువ మంది ఉంటున్నారు. అయితే గుండెపోటు కారణంగా అకాల మరణాల సంఖ్య పెరుగుతున్నందున ఆయుర్వేద నిపుణులు 5 పద్దతులను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

1. సూర్యోదయానికి 2 గంటల ముందు నిద్ర లేవడం
ప్రతి ఒక్కరు సూర్యోదయానికి రెండు గంటల ముందే నిద్రలేవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తెల్లవారుజామున మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందని, ఏది చేసినా దాని ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు.

2. రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి
ఆయుర్వేద నిపుణులు ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగమని సిఫార్సు చేస్తున్నారు. ఇది శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా కాపాడుతుందన్నారు. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని సూచించారు.

3. యోగా, ధ్యానం సాధన చేయాలి
ఎండార్ఫిన్స్, సెరోటోనిన్-మూడ్ అప్‌లిఫ్టింగ్ వంటి ఒత్తిడిని తగ్గించే హార్మోన్‌లను సరైన మోతాదులో పొందడానికి ప్రతిరోజూ యోగా, మెడిటేషన్ తప్పనిసరి. దీర్ఘకాలిక ఒత్తిడి, డిప్రెషన్ గుండె జబ్బులకు ప్రధాన కారణమని పలు అధ్యయనాలలో తేలింది. అందుకే కచ్చితంగా యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

4. ఆహారం తీసుకోవడానికి సరైన సమయం
భోజనం 12-12.30 PM, అల్పాహారం 7.00 AM కి చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనం, టిఫిన్ మధ్య 4 నుంచి 5 గంటల గ్యాప్ ఉండాలన్నారు. ఇది జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి తోడ్పడుతుందన్నారు. ప్రతిరోజు ఎక్కువగా నీరు తాగాలి. భోజనం చేసిన కొద్ది సేపటి తర్వాత గింజలు, పండ్లు తింటే మంచిది. మంచి నిద్ర కోసం కనీసం 2 గంటల భోజనాన్ని ముగించాలి. అప్పుడే జీర్ణక్రియ సజావుగా సాగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

5. మధ్యాహ్నం నిద్రకు దూరంగా ఉండాలి
మధ్యాహ్నం నిద్రకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది నిద్రలేమి, అలసట, బద్ధకాన్ని పెంచుతుంది వృద్ధులు కావాలనుకుంటే యోగ నిద్ర చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

లైవ్‌ మ్యాచ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. నలుగురు ఆటగాళ్లు అదుపులోకి.. మ్యాచ్‌ రద్దు..?

Taliban-Panjshir: పోరాడి ఓడారా.. కుట్రలు, కుయుక్తుల మందు లొంగిపోయారా.. కాలకేయులు చేతుల్లోకి పంజ్‌షిర్‌‌..

YCP Leader Warning: పనులు ఆపేస్తారా.. దాడులు చేయమంటారా.. కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ నాయకుడి వార్నింగ్‌