Lifestyle: సరిగ్గా నిద్రపోవడం లేదా.? చర్మ సమస్యలు తప్పవు..

|

Sep 03, 2024 | 3:37 PM

కొన్నేళ్ల క్రితం నిద్రలేమి అనే ఒక ఆరోగ్య సమస్య ఉంటుందని కూడా బహుశా ఎవరూ ఊహించకపోయి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ సమస్య బారినపడుతున్నారు. కంటి నిద్ర లేకుండా ఇబ్బంది పడే వారు...

Lifestyle: సరిగ్గా నిద్రపోవడం లేదా.? చర్మ సమస్యలు తప్పవు..
Lack Of Sleep
Follow us on

కొన్నేళ్ల క్రితం నిద్రలేమి అనే ఒక ఆరోగ్య సమస్య ఉంటుందని కూడా బహుశా ఎవరూ ఊహించకపోయి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ సమస్య బారినపడుతున్నారు. కంటి నిద్ర లేకుండా ఇబ్బంది పడే వారు ఎంతో మంది ఉన్నారు. ఇక మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన నిద్రలేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

మారిన జీవన విధానం, ఉరుకుల పరుగులతో నిండి జీవితం, పని ఒత్తిడి, ఆందోళ ఇలా ఎన్నో రకాల కారణంగా నిద్ర నాణ్యతను దెబ్బ తీస్తున్నాయి. అయితే నిద్రలేమి కారణంగా మానసికంగా ఎన్నో సమస్యలకు కారణమవుతుందని తెలిసిందే. అయితే నిద్రలేమి కేవలం మానసిక సమస్యలే కాకుండా పలు శారీరక సమస్యలకు కూడా దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ నిద్రలేమితో తలెత్తే ఆ చర్మ సంబంధిత సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* నిద్రలేమి సమస్య కారణంగా ముఖంపై మొటిమలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రలేమి కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇది శారీరక వ్యవస్థల పనితీరు దెబ్బతింటుంది. ఈ కారణంగానే శరీరంలో ఇన్సులిన్‌ తగ్గుతుంది. అలాగే ఒత్తిడి, కార్టిసాల్ లెవల్స్ పెంచే హార్మోన్స్ ఎక్కువుతాయి. ఇది చర్మంపై మొటిమలు, ముడతలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా చర్మం సహజత్వం కోల్పోవడంతో పాటు, త్వరగా వృద్ధాప్య ఛాయలు ఏర్పడుతాయి.

* నిద్రలేమి కారణంగా కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. కళ్లలో మంట, లేదా కళ్లు ఉబ్బడం వంటి సమస్యలు వస్తాయి. సరైన నిద్రలేక పోతే కళ్లకు రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో కళ్లు పొడిబారడం, చిరాకు, దురద వంటివి రావచ్చు. దీర్ఘకాలంలో కళ్లు ఇన్‌ఫెక్షన్స్ బారిన పడి కంటి చూపు తగ్గిపోవచ్చు. అలాగే కళ్లు చుట్టు ఉన్న చర్మం ఉబ్బి వికారంగా మారే అవకాశం ఉంటుంది.

* నిద్రలేమి కారణంగా తలెత్తే మరో ప్రధాన చర్మం సమస్య చర్మంలో తేమ శాతం తగ్గడం. దీంతో చర్మంలో రక్త ప్రసరణ జరగదు. ఈ కారణంగా శరీర భాగాలకు ఆక్సిజన్ సరిగా అందవు. వీటి కారణంగా చర్మంపై మచ్చలు, రంగు మారడం, చర్మం పెలుసులుగా మారడం వంటి సమస్యలు తప్పవు.

* చర్మంపై పగుళ్లు రావడానికి కూడా నిద్రలేమి ఒక కారణంగా చెప్పొచ్చు. నిద్రలేమి కారణంగా తలెత్తే ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ హార్మోన్ లెవల్స్ పెరుగుతాయి. ఫలితంగా సెబమ్ ఉత్పత్తి, ఇన్‌ఫ్లమేషన్ పెరిగి చర్మంపై పగుళ్లు ఏర్పడటం, రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలు రావచ్చు. ఈ కారణంగా మొటిమలతో పాటు, పగుళ్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..