Mental Stress: ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి 5 సులువైన మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..

|

Sep 26, 2021 | 7:59 PM

Mental Stress: బిజీ షెడ్యూల్‌ వల్ల చాలామంది జీవితంలో మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. దీనివల్ల వ్యక్తిగత జీవితానికి ఆటంకం కలుగుతుంది. సమస్యలని పరిష్కరించలేక

Mental Stress: ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి 5 సులువైన మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..
Stress
Follow us on

Mental Stress: బిజీ షెడ్యూల్‌ వల్ల చాలామంది జీవితంలో మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. దీనివల్ల వ్యక్తిగత జీవితానికి ఆటంకం కలుగుతుంది. సమస్యలని పరిష్కరించలేక డిప్రెషన్‌కి లోనవుతున్నారు. కొంతమంది ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి మొబైల్‌ చూడటం, సోషల్ మీడియాలో గడపటం, ఇష్టమైన వెబ్‌ సిరీస్‌లను వీక్షించడం లేదంటే మూవీ చూడటం వంటివి చేస్తున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఒత్తిడి ప్రభావం ధీర్ఘకాలికంగా ఉంటుంది. భవిష్యత్‌లో చాలా అనర్థాలకు కారణం అవుతుంది. అందువల్ల దీని నుంచి పూర్తిగా బయటపడాలంటే ఈ 5 చిట్కాలు పాటించడం తప్పనిసరి. అవేంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. ధ్యానం
ఒత్తిడిని నివారించడానికి ప్రతిరోజూ 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం చేయాలి. ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. క్రమం తప్పకుండా చేయడం వల్ల మీరు ఒత్తిడి నుంచి బయటపడుతారు. అంతేకాదు ఆందోళన స్థాయి తగ్గుతుంది.

2. అరోమాథెరపీ
అరోమాథెరపీ చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెరుగుతుంది.

3. రాయడం
మీ అనుభవాలు, భయాలు, ఆలోచనల గురించి ప్రతిరోజూ ఒక బుక్‌లో రాయండి. ఈ థెరపీ మీ మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల మీరు వదిలిపెట్టిన పనులు, భవిష్యత్‌లో చేయాల్సిన పనులు అన్ని గుర్తుకువస్తాయి. తద్వారా మంచి రిలీఫ్ ఉంటుంది.

4. శ్వాస వ్యాయామాలు
ఒత్తిడి, ఉద్రిక్తత నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ కొద్దిసేపు ప్రాణాయామం చేయాలి.ఈ వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం ద్వారా మంచి రిలాక్స్‌ పొందుతారు. జీవక్రియ రేటు మెరుగుపడుతుంది.

5. తగినంత నిద్ర
రోజూ సమయానికి నిద్రపోవాలి. ఉదయం వాకింగ్‌ చేయాలి. అప్పుడు తప్పకుండా మార్పు కనిపిస్తుంది. నిద్రించడానికి 3 నుంచి 4 గంటల ముందు మొబైల్, ఐఫోన్, టీవీని ఉపయోగించడం మానేయండి. కచ్చితంగా ఒత్తిడి నుంచి బయటపడుతారు.

Lungs Health: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేశారో ప్రాణాలకే ముప్పు..

Jowar Vegetable Biryani: జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలు బెస్ట్, జొన్న బిర్యాని తయారీ ఎలా అంటే

దోమ కాటేస్తే అంతే సంగతులు.. డెంగ్యూ కొత్త మ్యూటెంట్..11 రాష్ట్రాల్లో కల్లోలం.. వీడియో