Bath in Winter: చలికాలంలో స్నానం అంటే ఇన్ని జాగ్రత్తలు పాటించాలా..? నిపుణులు ఏమంటున్నారంటే..

|

Dec 11, 2022 | 8:17 PM

కొందరు ఏ సీజన్ అయినా చన్నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఒక్కోసారి వారు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చలికాలంలో కూడా ఎక్కువగా.. ఫలితంగా ఏం జరుగుతుందంటే..

Bath in Winter: చలికాలంలో స్నానం అంటే ఇన్ని జాగ్రత్తలు పాటించాలా..? నిపుణులు ఏమంటున్నారంటే..
Bath In Winter
Follow us on

చాలా మంది రోజంతా తాజాగా కనిపించాలనే ఉద్దేశంతో ఉదయాన్నే లేచి స్నానం చేస్తారు. అలాగే కొందరు వేడినీళ్లు లేకపోతే స్నానం చేయడానికి ఇష్టపడరు. వారు స్నానం చేయాలంటే వేడినీళ్లు తప్పనిసరి. చన్నీళ్ల స్నానం చేేసేవారి పరిస్థితి కూడా అంతే. వేడినీళ్లతో ఏ కాలంలో స్నానం చేసినా శరీరానికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది. కానీ కొందరు ఏ సీజన్ అయినా చన్నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఒక్కోసారి వారు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చలికాలంలో కూడా ఎక్కువగా చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒక్కోసారి పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎప్పుడైనా రావచ్చని వారు చెబుతున్నారు. ఇలా మరణించిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. అందువల్ల చలికి సున్నితంగా ఉండేవారు చలికాలంలో చన్నీళ్ల స్నానానికి స్వస్తి పలకడమే మేలని వారు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో అంతే నష్టాలు కూడా ఉంటాయని అంటున్నారు.

రోజు వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోయి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందువల్ల ప్రతిరోజు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని, దాని వల్ల ఒంటినొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని, మంచి నిద్ర కూడా పడుతుందని చెబుతున్నరు ముఖ్యంగా చలికాలంలో చల్లని నీటితో స్నానం చేయకూడదని.. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ కలిగితే దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు: 

ఇవి కూడా చదవండి

1) కళ్ళతో స్పష్టంగా చూడలేకపోవడం

2) శరీరంలో బలహీనత

3) తీవ్రమైన తలనొప్పి

4) శరీరంలోని ఏ భాగంలోనైనా తిమ్మిర్లు రావడం

5) వాంతులు లేదా వికారం

6) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

7) మాట్లాడేటప్పుడు తడబాటు

8) మెదడులో రక్తస్రావం కారణంగా మూర్చపోవడం.

 

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..