Bad Breath: నోటి దుర్వాసన శాశ్వతంగా పోవాలంటే ఏం చేయాలి? ఈ జాగ్రత్తలతో ఈజీగా బయటపడొచ్చు

చాలా మంది నోటి దుర్వాసన (బ్యాడ్ బ్రీత్ లేదా హాలిటోసిస్) సమస్యతో ఇబ్బంది పడతారు. రోజుకు రెండుసార్లు పళ్లు తోముకున్నా, మౌత్ వాష్ వాడినా సమస్య దూరంకాదు. నోటి దుర్వాసనను దూరం చేసుకోవడం ఇంత సులభమా అని ఆశ్యర్యపోతారు. "ఇంతకాలం ఇది ..

Bad Breath: నోటి దుర్వాసన శాశ్వతంగా పోవాలంటే ఏం చేయాలి? ఈ జాగ్రత్తలతో ఈజీగా బయటపడొచ్చు
Bad Breath

Updated on: Dec 15, 2025 | 1:06 PM

చాలా మంది నోటి దుర్వాసన (బ్యాడ్ బ్రీత్ లేదా హాలిటోసిస్) సమస్యతో ఇబ్బంది పడతారు. రోజుకు రెండుసార్లు పళ్లు తోముకున్నా, మౌత్ వాష్ వాడినా సమస్య దూరంకాదు. నోటి దుర్వాసనను దూరం చేసుకోవడం ఇంత సులభమా అని ఆశ్చర్యపోతారు. “ఇంతకాలం ఇది తెలియక ఇబ్బంది పడ్డానా?” అని అనిపిస్తుంది. నిజానికి నోటి దుర్వాసనకు 90% కారణాలు నోటి సంబంధిత ఇన్ఫెక్షన్స్‌. మిగతా 10% శరీరంలోని ఇతర సమస్యల వల్ల వస్తాయి. ఇవి తెలిస్తే ముందుగానే జాగ్రత్త పడవచ్చు.

నోటి దుర్వాసనకు ప్రధాన కారణం నోట్లో పేరుకుపోయే బ్యాక్టీరియా. ఆహార అవశేషాలు, చనిపోయిన కణాలు నాలుకపై, పళ్ల మధ్య, చిగుళ్ల చుట్టూ చేరి సల్ఫర్ సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి దుర్వాసనకు కారణమవుతాయి. నోటి పరిశుభ్రత లోపిస్తే పళ్ల కుళ్లు, చిగుళ్ల వ్యాధులు (జింజివైటిస్, పీరియోడాంటైటిస్) వస్తాయి. నాలుక వెనుక భాగంలో బ్యాక్టీరియా ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది చాలా మందికి తెలియదు!

నోరు పొడిబారడం (డ్రై మౌత్). రాత్రి నిద్రపోయినప్పుడు లాలాజలం తక్కువగా స్రవిస్తుంది. దీంతో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. కాబట్టి ఉదయాన్నే దుర్వాసన వస్తుంది. పొగతాగడం, మద్యం సేవించడం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాలు కూడా కారణం కావచ్చు. కొందరికి వయ్యార అల్సర్, డయాబెటిస్, కిడ్నీ, లివర్ సమస్యలు, సైనస్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. ఇవి తెలియకపోతే సమస్య ఎక్కువవుతుంది.

ఇలా బయటపడొచ్చు..

  1. నోటి పరిశుభ్రత:

    రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకోండి. నాలుకను టంగ్ క్లీనర్‌తో శుభ్రం చేయండి.

  2. ఫ్లాసింగ్ & మౌత్ వాష్:

    పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్ధాలను తొలగించడానికి డెంటల్ ఫ్లాస్ వాడండి. ఆల్కహాల్ లేని మౌత్ వాష్ ఉపయోగించండి.

  3. నీరు ఎక్కువ తాగండి:

    నోరు పొడిబారకుండా చూసుకోండి. రోజూ 8-10 గ్లాసుల నీరు తాగండి. షుగర్ లెస్ గమ్ నమలడం కూడా లాలాజల ఉత్పత్తి పెంచుతుంది.

  4. ఆహార అలవాట్లు:

    ఉల్లిపాయలు, వెల్లుల్లి తిన్న తర్వాత పుదీనా ఆకులు లేదా యాలకులు నమలండి. పొగతాగడం, మద్యం వాడకానికి దూరంగా ఉండండి.

  5. వంటింటి చిట్కాలు:

    లవంగాలు, సోంపు, యాలకులు నమలండి. నిమ్మరసం నీటిని పుక్కిలించండి. గ్రీన్ టీ తాగండి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడంతో నోటి దుర్వాసన దూరమవుతుంది.

  6. డాక్టర్ సలహా:

    సమస్య తీవ్రంగా ఉంటే డెంటిస్ట్‌ను, అవసరమైతే గ్యాస్ట్రో డాక్టర్‌ను సంప్రదించండి. స్కేలింగ్ చేయించుకోండి.

ఈ చిన్న టిప్స్ పాటిస్తూ నోటి దుర్వాసనను సులభంగా తగ్గించుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి.. ఆరోగ్యంగా ఉండండి!