Spiders: ఇంట్లో మూలల్లో చూస్తే సాలీడు గూళ్లు కనిపిస్తాయి. ఇవి చాలా ప్రమాదకరం. అంతేకాదు ఇవి ఇంట్లో ఉండే మంచిది కాదు. ఇంటి మూలల నుంచి ప్రారంభించి ఇవి ఇల్లు మొత్తం గూళ్లని విస్తరిస్తాయి. తరువాత ఇంటిని శుభ్రం చేయాలంటే చాలా కష్టమవుతుంది. మీరు కూడా సాలెపురుగులతో ఇబ్బందిపడుతుంటే వదిలించుకునేందుకు కొన్ని మార్గాలు తెలుసుకుందాం.
1. పుదీనా నూనె స్ప్రే
మీరు ఇంటి మూలల్లో పుదీనా నూనె స్ప్రే చేస్తే సాలీడులు పారిపోతాయి. ఎందుకంటే సాలీడు దీని వాసనను భరించలేదు. ఇంటి మూలల్లో పుదీనా ఆయిల్ స్ప్రే చేస్తే సాలెపురుగులు తొలగిపోయి ఇంటిని వదిలి ఎక్కడో దూరంగా ఉంటాయి.
2. వారానికోసారి ఇళ్లు శుభ్రం చేయాలి..
ప్రజలు చాలా రోజులకొకసారి ఇంటిని శుభ్రం చేస్తారు. దీంతో సాలీడులు ఇష్టమొచ్చిన దగ్గర దాని సంతతిని అభివృద్ధి చేస్తాయి. కానీ మీరు ప్రతి వారం ఇంటిని శుభ్రం చేస్తే సాలెపురుగులు మీ ఇంటిని వదిలివేస్తాయి. మీ ఇల్లు చాలా కాలం పాటు శుభ్రంగా ఉంటుంది.
3. ఇంటి బయట శుభ్రం చేయడం మర్చిపోవద్దు
సాలెపురుగులు ఇంట్లో గూళ్లు కట్టుకుంటాయి కానీ అవి మీ ఇంటి బయట కూడా క్యాంప్ చేస్తూ ఉంటాయి. సాలెపురుగులు సాధారణంగా ఇంటి మూలలు, బాల్కనీలను ఎంచుకొని గూళ్లు కట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి కీటకాలను పట్టుకోవడానికి మంచి ప్రదేశాలు. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.
4. ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి
సాలె పురుగుల నుంచి మీ ఇంటిని కాపాడుకోవాలంటే అవి ఎక్కడకనిపిస్తే అక్కడ చీపురుతో శుభ్రం చేయాలి. దీంతో మీ ఇల్లు అన్ని సమయాలలో చక్కగా కనిపిస్తుంది.
5. నీటిని పిచికారీ
మీ ఇంటి వెలుపల స్పైడర్ వెబ్‌లు కనిపిస్తే వెంటనే పైప్ ద్వారా నీటితో వాటిని తొలగించాలి. మరొసారి అవి అక్కడికి రాకుండా ఉంటాయి.