Guava Leaves Benefits: జామ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్ పెట్టినట్లే..

|

Aug 16, 2021 | 9:46 AM

సాధారణంగా జామ కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో పోషకాలు, విటమిన్స్ అధికంగా ఉండడం వలన శరీరంలోని అనారోగ్య

Guava Leaves Benefits: జామ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్ పెట్టినట్లే..
Guava Leaves
Follow us on

సాధారణంగా జామ కాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో పోషకాలు, విటమిన్స్ అధికంగా ఉండడం వలన శరీరంలోని అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంచుంతుంది. కేవలం జామ కాయలతో మాత్రమే కాకుండా.. జామ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. జామ ఆకులను వేడి నీటిలో వేసి తాగడం వలన సీజనల్ వ్యాధులు తగ్గడమే కాకుండా.. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ జామ ఆకులతో జుట్టు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. వీటిని వాడడం వలన జుట్టు నల్లగా, మందంగా , పొడవుగా, మృదువగా ఉంటుంది. ఈ ఆకులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా.

జామ ఆకుల పేస్ట్..
వెంట్రుకలను పొడవుగా, నల్లగా, మందంగా, మృదువుగా ఆకులతో పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా.. కొన్ని జామ ఆకులను తీసుకొని, వాటిని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుని చిక్కటి పేస్ట్‏గా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని హెయిర్ కలర్ బ్రష్ సహాయంతో మీ తలపై, జుట్టుకు అప్లై చేయండి. ఆ తర్వాత స్కాల్ప్‌ని వేళ్ల సహాయంతో ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి, అరగంట పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత కాస్త తేలికపాటి షాంపూతో కడిగేయాలి.

ఆకుల నీరు..
జుట్టు పెరుగుదల, పొడవు, అందాన్ని పెంచడానికి జుట్టు మీద జామ ఆకుల నీటిని కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం తాజా జామ ఆకులను తీసుకొని ఆపై వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. ఇప్పుడు ఒక పాత్రలో మరిగేందుకు ఒక లీటరు నీటిని ఉంచి అందులో జామ ఆకులను ఉంచండి. ఈ నీరు మరిగేటప్పుడు తక్కువ మంట మీద రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత నీటిని చల్లారనివ్వాలి.. నీరు చల్లబడిన తర్వాత దానిని ఫిల్టర్ చేసి మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ జామ నీటిని హెయిర్ కలర్ బ్రష్ సహాయంతో మూలాల నుండి జుట్టు చివరల వరకు అప్లై చేయండి. ఆ తర్వాత చేతులతో తలను ఐదు నిమిషాలు మసాజ్ చేయండి. ఆ తర్వాత ఒక గంట పాటు అలాగే ఉంచి తలను సాధారణ నీటితో కడగాలి.

జామ ఆకులు.. ఉల్లిపాయ రసం.. కొబ్బరి నూన పేస్ట్..
ముందుగా ఒక గిన్నెలో జామ ఆకులను తీసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‎గా చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయను తీసుకుని దానిని కూడా పేస్ట్ చేసి అందులో నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జామ ఆకుల పేస్ట్, ఉల్లిపాయ రసం రెండూ కలిపి అందులో ఒక చెంచా కొబ్బరి నూనె కూడా వేసి అన్నింటినీ బాగా కలిపాలి. ఇప్పుడు పేస్టును హెయిర్ కలర్ బ్రష్ లేదా వేళ్ల సహాయంతో తలకు అప్లై చేసి ఐదు నిమిషాలు మృదువుగా మాసాజ్ చేసి అరగంట తర్వాత షాంపూతో కడిగేయాలి.

Also Read: Health Tips: పరగడుపున ఈ ఆహారాన్ని అస్సలు తినొద్దు.. చాలా డేంజర్.. ఎందుకో తెలుసుకోండి!

Luxury cars: పేరుకేమో బడా బాబులు.. పైగా సొసైటీలో సెలబ్రిటీ హోదా.. కానీ, వీళ్ల కక్కుర్తి చూస్తే ఖంగు తినాల్సిందే!