మనం వంటలలో రుచి కోసం ఉపయోగించే వివిధ మసాలా దినుసులలో జీలకర్ర ఒకటి. పిత్తం పెరగడం, తరచూ తలనొప్పి, జలుబు, గొంతు నొప్పి, జీర్ణశక్తి మెరుగుపడాల్సిన వారు కొద్దిగా జీలకర్రను నోటిలో వేసుకుని నమిలి తినవచ్చు. లేదా వేడివేడి జీలకర్ర టీ తాగవచ్చు. జీలకర్రలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు వివిధ ఆరోగ్య సమస్యలకు జీరా వాటర్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే అద్భుత ప్రయోజనాలు పొందుతారు.. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.
అధ్యయనం ప్రకారం..
ఇటీవలి అధ్యయనాల ప్రకారం, ఖాళీ కడుపుతో జీరా నీటిని తాగడం అలవాటు చేసుకుంటే.. అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఎనిమిది వారాల పాటు ఈ అభ్యాసాన్ని కొనసాగించే వారు, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తరిమికొడతారు. జీలకర్ర నీరు కొలెస్ట్రాల్‌కు సహజ నివారణగా పనిచేస్తాయి. ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి జీలకర్ర నీటిని చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక టీస్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇది మీరు కొన్ని రోజుల పాటు అలవాటు చేసుకోవాలి. అయితే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇలాంటి కొత్త మార్పులు తీసుకునే ముందు ఒకసారి మీ వైద్యుడిని సంప్రదించటం మంచిది.
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవాలంటే జీలకర్ర ప్రయోగం చాలా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని తయారు చేసుకోవటం సులభం మాత్రమే కాదు, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మీరు దీని పూర్తి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది జీర్ణ శక్తి పెరుగుతుంది. మీరు తిన్న ఆహారం క్రమంగా బాగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి.
అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్నవారు.. మీ జీవక్రియను పెంచి, కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి జీలకర్రను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో జీరా నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. దీంతో మధుమేహాన్ని సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. జీరా వాటర్ మీ బొడ్డు కొవ్వును కరిగించడమే కాకుండా, దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల మీ శరీరంలోని ఏ భాగానైనా మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది.