తాటి పిందె దశలో కల్లును, 2వ దశలో రుచికరమైన ముంజులను,3వ దశలో అమోఘమైన సువాసనతో రుచికరమైన తాటి పండ్లను, చివరి దశలో తాటి బుర్ర నుండి గుంజు రుచికి రుచి అమోఘమైన పోషకాల గని. అందుకే పల్లెటూరు వాసులకు ఏడాదికి ఒకసారి దొరికే పోషకాల గని. బుర్రగుంజులో తక్కువ క్యాలరీస్ ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందని చెబుతారు. తాటిబుర్ర గుంజు తీపితనం తక్కువ, కమ్మదనం ఎక్కువగా ఉండటంతో షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
పల్లెటూర్లలో నాగుల చవితి వచ్చిందంటే తేగలతో పాటు, తాటి బుర్రగుంజును కూడా అమృతంలా లాగించేస్తుంటారు. పూర్వికులు ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడని బుర్ర గుంజును తినడం వల్లే నూటికి నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతికే వారని మన పెద్దలు చెబుతున్నారు.
నేడు పల్లెటూరి వాసులకు దొరికే అమృతం లాంటి తాటి బుర్ర గుంజు ఈ మధ్యకాలంలో హైవేల పక్కన అమ్మడం విశేషం… సంవత్సరానికి ఒకసారి దొరికే తాటి బుర్ర గుంజును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పల్లెటూర్లలో అయితే పొలం గట్లలో వేసిన తాటికాయలు బుర్రగుంజులా మారి.. తర్వాత తేగలుగా విక్రయిస్తుంటారు. బుర్రగుంజులో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల వారానికి ఒకసారి గానీ, వారానికి మూడు రోజులు గాని తినడం వల్ల ఆరోగ్యకరమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉండడం వల్ల వీటిని తినమని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.