Health Benefits: ఈ పండు పోషకాల పవర్‌హౌజ్.. ఉదయాన్నే తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొంచెం అజాగ్రత్త కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. అయితే.. కొన్ని పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా.. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.. అలాంటి పండ్లలో కివి పండు ఒకటి..

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొంచెం అజాగ్రత్త కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. అయితే.. కొన్ని పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా.. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.. అలాంటి పండ్లలో కివి పండు ఒకటి.. డయాబెటిక్ రోగులతోపాటు.. పలు సమస్యల్లో కివి చాలా మంచిదని.. దీనిలోని పోషకాలు.. పలు సమస్యలను నివారించడంలో సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కివి పండు బయటి నుంచి చాలా చిన్న పండులా కనిపిస్తుంది. కానీ, ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఈ పండు లోపల నుండి ఆకుపచ్చగా ఉంటుంది.. ఇది తీపి – పుల్లని రుచిని కలిగి ఉంటుంది. ఇది అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటిగా పరిగణిస్తారు. అంతేకాకుండా వాతావరణంతో పాటు దీని రేటు మారుతుంది.
కివి పండులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫైబర్, ఫోలేట్, పొటాషియంతోపాటు.. యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి.. వీటితో పాటు, కివిలో కాల్షియం, కాపర్, జింక్, మెగ్నీషియం, నియాసిన్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు.. శరీరాన్ని ఇతర వ్యాధుల నుంచి రక్షిస్తాయి..
కివి పండు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇంకా డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులలో ప్లేట్‌లెట్లను వేగంగా పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇంకా ఈ పండు ఇన్ఫెక్షన్ల నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తినాలి. ఇది చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి కివి తినవచ్చు. ఇందులో పోషకాలు ఎనర్జిటిక్ గా ఉండేలా సహాయపడతాయి.
కివి పండులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
బరువు తగ్గాలనుకునే వారికి కివి మంచి ఎంపిక..
ఒక మీడియం సైజు కివీ పండులో సుమారు 44-49 కేలరీలు ఉంటాయి. కావున బరువు తగ్గాలనుకునేవారికి కివి పండు మంచి ఎంపిక.. ఎందుకంటే వాటిలో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కావున బరువు ఈజీగా తగ్గొచ్చు.. ఇంకా ఉదయాన్నే ఈ పండు తింటే చాలా తక్కువ కాలంలోనే ప్రభావం కనిపిస్తుందంటున్నారు డైటీషియన్లు..
ఈ పండు సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది.. ఇంకా రాత్రి నిద్రను మెరుగుపరుస్తుంది.
కివి పండులో లుటిన్ – ఫైటోకెమికల్స్ ఉంటాయి.. ఇవి శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచుతాయి. రక్తహీనత ఉన్న రోగులు దీని నుండి ప్రయోజనం పొందవచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
