ఇంతకు ముందు అంటే మన అమ్మమ్మ కాలంలో వంటలన్నీ మట్టి పాత్రల్లోనే వండేవి అందుకే ఈ పాత్రల్లో వంట చేసే విధానం అప్పటి వారికీ తెలుసు. ఇప్పుడు స్టీల్, ఐరన్, నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేయడం మొదలు పెట్టారు. అయితే ఇప్పటికీ కొన్ని వంటలను చేయాలంటే మట్టి పాత్రలే బెస్ట్ అంటున్నారు. గోదావరి జిల్లా వాసులు ఐతే పులస పులుసు పెట్టాలంటే మట్టి గిన్నెనే ఉపయోగిస్తారు. ఇలా మట్టి కుండలలో సంప్రదాయబద్ధంగా చేసే వంటకాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ మట్టి పాత్రలో వండకపోయినా లేదా కొత్త పాత్రలో వంట చేయబోతున్నట్లయితే.. కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. లేకపోతే మట్టి పాత్రలు పగిలి పోతాయి. లేదా అందులో తయారు చేసిన ఆహారం రుచి భిన్నంగా ఉంటుంది. ఈ నేపధ్యంలో చిన్న చిన్న వంటింటి చిట్కాలను షేర్ చేసే ప్రముఖ చెఫ్ పంకజ్ భదౌరియా ఇప్పుడు కొత్త మట్టి పాత్రలో మొదటిసారి ఆహారం వండవలసి వస్తే.. ముందుగా ఎలాంటి మట్టి పాత్రను సిద్ధం చేయాలి అనే విషయాన్నీ పంచుకున్నారు. మట్టి పాత్రలో వంట చేసే ముందు మూడు విషయాలు గుర్తుంచుకోవాలి అని చెప్పారు.
మట్టి పాత్రలో వంట చేసే ముందు.. అంటే మట్టి పాత్ర పూర్తిగా కొత్తది అయితే.. ఆ మట్టి గిన్నెని నీటిలో మునిగేలా నీళ్ళల్లోనే ఉంచమని చెఫ్ పంకజ్ భదౌరియా చెప్పారు. వాస్తవానికి ఇలా చేయడం వలన మట్టి పాత్ర నీటిని గ్రహిస్తుంది. దానిలో పేరుకున్న దుమ్ము, ధూళి శుభ్రం అవుతుంది.
చెఫ్ పంకజ్ భదౌరియా మట్టి కుండలను శుభ్రం చేయడం నుంచి వాటిని దృఢంగా తయారు చేయడం వరకు చిట్కాలు ఇచ్చారు. మట్టి కుండలు, లేదా మట్టి పాత్రలు నీటిలో మునిగేలా చేసి సుమారు 12 నుండి 13 గంటల ఉంచాలి. ఇప్పుడు నీటిని నుంచి పాత్రను తీసి శుభ్రంగా కడిగి.. రెండు మూడు గంటల పాటు పాత్రను పూర్తిగా ఆరనివ్వండి. ఎండలో పూర్తిగా తడి ఆరిపోయే వరకూ ఎండబెట్టాలి.
మట్టి కుండ బాగా ఆరిపోయిన తర్వాత లోపల, వెలుపల కొబ్బరి నూనె కానీ, ఏదైనా వంట నూనె తో కాటన్ కి అద్ది పూర్తిగా అప్లై చేయండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి తక్కువ మంట మీద ఆ పాత్రను పెట్టండి. ఇలా ఐదు నిముషాలు ఉంచిన తర్వాత నూనె మొత్తం కుండ పీల్చుకుంటుంది. రంధ్రాలు పూడుకుంటాయి. ఇలా తయారు చేసిన మట్టి కుండలో వంట చేస్తే కుండ పగిలిపోదు లేదా పగిలిపోదని చెఫ్ పంకజ్ భదౌరియా చెప్పారు.
ఇక్కడ వీడియో చూడండి
పంకజ్ భదౌరియా ఇంతకు ముందు ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. అయితే వంట పట్ల ఉన్న మక్కువ కారణంగా ఆమె తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి మాస్టర్ చెఫ్ ఇండియాలో పాల్గొని మొదటి సీజన్ విజేతగా నిలిచింది. నేడు అత్యంత ప్రసిద్ధ చెఫ్‌లలో ఒకరుగా చోటు సంపాదించుకుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..