Kitchen Hacks: మీరు కొన్న తేనె ప్రకృతి సిద్ధమా.. నకిలీదో తెలుసుకోవాలా.. ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ తో చెక్ చేయండి..

|

Dec 24, 2024 | 11:24 AM

తేనె అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడతారు. తేనే ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి, బరువు తగ్గడం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే గత కొంత కాలంగా తేనె వినియోగం పెరిగిపోయింది. దీంతో మార్కెట్ లో రకరకాల పేర్లతో తేనె లభిస్తుంది. అయితే ఈ తేనె ప్రకృతి సిద్ధంగా లభించిందా అంటే అసలైనదా, నకిలీదా తెలుసుకోవడం కొంచెం కష్టం. కనుక మీరు కొనుగోలు చేసిన తేనె స్వచ్ఛమైనదో కాదో ఇంట్లోనే చెక్ చేసుకోవడానికి సింపుల్ టిప్స్ ను అనుసరించండి.

Kitchen Hacks: మీరు కొన్న తేనె ప్రకృతి సిద్ధమా.. నకిలీదో తెలుసుకోవాలా.. ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ తో చెక్ చేయండి..
Honey Purity Test
Follow us on

ప్రస్తుతం మార్కెట్‌లో లభించే ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం కల్తీలే. నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాల నుంచి తేనె వరకు అన్నింటిలోనూ కల్తీ జరుగుతూనే ఉంది. కల్తీ తేనె మార్కెట్‌లో దొరుకుతుంది. అయితే ఆ తేనె కల్తీ అని తెలియక చాలా మంది దానిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఇలా మార్కెట్ నుంచి కొనే తేనె స్వచ్ఛమైనదా కాదా అని ఇంట్లోనే తెలుసుకోవచ్చు. కొన్ని పద్ధతులను ఉపయోగించి తేనె నిజమైనదా లేదా నకిలీదా అని తెలుసుకోవచ్చు.

  1. బొటనవేలుపై రెండు చుక్కల తేనెను వేయండి. తేనె నిజమైనదైతే.. అది వేలిపై స్థిరంగా ఉంటుంది. బొటనవేలుపై వేసిన వెంటనే పాకితే ఆ తేనె నకిలీదని అర్ధం చేసుకోవాలి.
  2. ఒక గ్లాసు వేడి నీటిని తీసుకుని అందులో ఒక చెంచా తేనె కలపండి. తేనె వెంటనే నీటిలో కరిగితే.. అది కల్తీ అని అర్థం. తేనె మందపాటి దారంలా ఏర్పడి నీటి అడుగున చేరితే అది స్వచ్ఛమైన తేనె అని అర్ధం.
  3. ఒక టిష్యూ పేపర్ తీసుకుని దానిపై రెండు చుక్కల తేనె వేయండి. స్వచ్ఛమైన తేనె అయితే కాగితంపై నిలిచి ఉంటుంది. అదే నకిలీ కల్తీ అయితే కాగితంలో కలిసి పోతుంది. ఈ విధంగా మీరు కొనుగోలు చేసిన తేనె నిజమైనదో కాదో మీరు కనుగొనవచ్చు.
  4. బ్రెడ్ ఉపయోగించి తేనె స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవచ్చు. రొట్టెపై స్వచ్ఛమైన తేనె వేస్తే గట్టిపడుతుంది. ఒకవేళ తేనెని బ్రెడ్ పై రాస్తే బ్రెడ్ మెత్తగా మారితే ఆ తేనె స్వచ్ఛమైనది కాదని అర్థం.
  5. ఇవి కూడా చదవండి
  6. ఒక చెక్క కర్ర చుట్టూ దూదిని చుట్టి దానిపై తేనె వేయాలి. ఇప్పుడు తేనె పూసిన కర్రను నిప్పు దగ్గరికి తీసుకుని వెళ్తే వెంటనే దూదికి మంట అంటుకుంటే అది స్వచ్ఛమైన తేనె అని అర్ధం. అలా కాకుండా ఆ దూది మండడానికి సమయం తీసుకుంటే అది కల్తీ తేనె అని గుర్తించాలి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)