Jojoba Oil : మొటిమల సమస్యకు దివ్యఔషధం జోజోబా ఆయిల్..! ఎలా వాడాలో తెలుసుకోండి..

|

Jul 20, 2021 | 5:40 PM

Jojoba Oil : జోజోబా నూనె చర్మాన్ని తేమగా చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, బి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, ఖనిజాలు ఉంటాయి.

Jojoba Oil : మొటిమల సమస్యకు దివ్యఔషధం జోజోబా ఆయిల్..! ఎలా వాడాలో తెలుసుకోండి..
Jojoba Oil
Follow us on

Jojoba Oil : జోజోబా నూనె చర్మాన్ని తేమగా చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, బి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, ఖనిజాలు ఉంటాయి. జోజోబా నూనెలో యాంటీ ఫంగల్, యాంటీమైక్రోబయల్ ఉన్నాయి. చర్మానికి సంబంధించిన అనేక సమస్యలకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇది మొటిమలను నియంత్రిస్తుంది. మచ్చలను పోగొడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం.. మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా మొటిమలను నయం చేయడంలో దీని పాత్ర అమోఘం. ఇది మీ చర్మం నుంచి తేమ కోల్పోకుండా నిరోధిస్తుంది. ఇతర నూనెలతో పోలిస్తే ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇది చర్మంలో కలిసిపోతుంది. ఇది చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తుంది. చర్మాన్ని టైట్ చేస్తుంది. అయితే దీనిని ఎలా వాడాలో తెలుసుకుందాం.

1. బంకమట్టి ప్యాక్ – బంకమట్టిని జోజోబా నూనెతో కలపండి. ముఖం, మెడ పై అప్లై చేయండి. కొద్దిసేపు ఆరనివ్వండి. తరువాత గోరువెచ్చని నీటితో కడగండి. గట్టిగా రుద్దకండి. ప్యాక్ తొలగించేటప్పుడు కొన్ని నిమిషాలు మెత్తగా మసాజ్ చేయండి. మీరు ఈ మాస్క్‌ని వారానికి రెండు మూడు సార్లు ప్రయత్నించవచ్చు.

2. మీరు దీన్ని ఫేస్ మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు – రెండు చెంచాల కలబంద జెల్, రెండు చెంచాల జోజోబా నూనె తీసుకోండి. రెండింటినీ ఒక గాజు కూజాలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాయిశ్చరైజర్‌గా వాడండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి ఒక నిమిషం పాటు మసాజ్ చేయండి. మీరు రోజులో ఎప్పుడైనా దీన్ని ఉపయోగించవచ్చు.

3. డైలీ క్రీమ్‌తో కలపండి – మీరు మీ రోజువారీ స్కిన్ క్రీమ్ లేదా జెల్‌తో జోజోబా నూనెను కలపవచ్చు మీ ముఖం పై అప్లై చేయవచ్చు.

4. దీన్ని నేరుగా వాడండి – మీరు జోజోబా నూనెను నేరుగా మీ ముఖం లేదా ప్రభావిత ప్రాంతాలపై కూడా వాడవచ్చు. కొన్ని చుక్కల జోజోబా నూనె తీసుకొని మీ ముఖం, మెడపై రాయండి. తేలికపాటి చేతులతో ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు మసాజ్ చేయండి. తర్వాత కడగకండి.

ప్రవీణ్ రాజీనామా వెనుక అసలు కారణమిదే…టీవీ9తో ప్రత్యేక ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ..:Rs Praveen Kumar Video.

Neuropathic Pain: తరచుగా తిమ్మిర్లు వస్తున్నాయా..నిర్లక్ష్యం వద్దు.. ఈ విటమిన్ లోపం ఏమో.. ఒక్కసారి చెక్ చేసుకోండి

Blue Origin Spaceflight : మరికొద్ది నిమిషాల్లో అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ టీం.. స్పేస్ టూరిజంకు ఇదే నాంది..