Beauty Tips: చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌ అవుతుంది..!

|

Dec 25, 2024 | 6:15 PM

సుగంధాలు వెదజల్లే మల్లె పువ్వులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మల్లె పూలు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో మల్లెపూవు, ఆకుల రసాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. జాస్మిన్ ఫ్లవర్ టీ తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Beauty Tips: చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌ అవుతుంది..!
Jasmin Flowers
Follow us on

మెరిసే చర్మం, నల్లటి ఒత్తైన కురులతో అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందాన్ని పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందం కోసం ఎంతో ఖర్చు చేసి సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తారు.. ఏవేవో ప్యాక్‌లు ట్రై చేస్తూ ఉంటారు. అయితే, మన గార్డెన్‌లో ఈజీగా దొరికే పూలు మన అందాన్ని రెట్టింపు చేస్తాయని మీకు తెలుసా..? మీ అందాన్ని పెంచడానికి ఖరీదైన క్రీముల కంటే.. మన పెరట్లో పూసే మల్లెపూలు ఎంతో మేలు చేస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

మన చుట్టూ ఎన్నో రకాల పూలు ఉన్నాయి. ఈ పువ్వులలో కొన్ని మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది కొన్ని ఆరోగ్య, చర్మ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. అందులో మల్లెపువ్వు ఒకటి. సుగంధాలు వెదజల్లే మల్లె పువ్వులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మల్లె పూలు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో మల్లెపూవు, ఆకుల రసాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. జాస్మిన్ ఫ్లవర్ టీ తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ముఖానికి తేమను అందించి మెరిపించే గుణాలు మల్లెలో అనేకం ఉన్నాయి. గుప్పెడు మల్లెలను పేస్టులా చేసి, అందులో చెంచా కొబ్బరినూనె కలిపి ముఖానికి ప్యాక్‌ల అప్లై చేసుకోవాలి. పావుగంట పాటు ముఖానికి మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. జాస్మిన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, మల్లెపూలతో తయారు చేసిన టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పువ్వు రసం చర్మానికి మేలు చేస్తుంది. గాయాలపై మల్లెపూల ముద్దను రాస్తే త్వరగా అది మాయమవుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.