Socks in Winter: మీరూ చలికాలంలో రాత్రిళ్లు సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా? ఇది మీ కోసమే..

|

Jan 03, 2025 | 12:49 PM

చలికాలంలో వెచ్చగా నిద్రపోవాలని అందరూ అనుకుంటారు. చాలా మంది మందపాటి దుప్పటిని కాళ్ల నుంచి తల వరకు మొత్తం కప్పేసి నిద్రపోతారు. అయితే ఇంకొంత మంది మాత్రమ పాదాలకు సాక్స్ లు ధరించి నిద్రపోతారు. ఇలా పాదాలకు సాక్స్ ధరించడం వల్ల రాత్రంతా వెచ్చగా ఉండి.. చలి తీవ్రతను తగ్గిస్తుంది. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది..

Socks in Winter: మీరూ చలికాలంలో రాత్రిళ్లు సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా? ఇది మీ కోసమే..
Socks In Winter
Follow us on

చలికాలంలో శరీరానికి వెచ్చదనం అవసరం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది చలిలో శరీరం నుంచి పాదాల వరకు వెచ్చని బట్టలు ధరిస్తారు. పాదాలు త్వరగా చల్లబడకుండా ఉండేందుకు రాత్రి పడుకునేటప్పుడు మందపాటి వెచ్చని సాక్స్‌లు ధరించే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు ఇలా సాక్స్‌లు ధరించడం ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహం మీలో ఎవరికైనా వచ్చిందా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

శీతాకాలంలో పడుకునే ముందు సాక్స్ ధరించాలా వద్దా అనేది నిద్ర నాణ్యత, పాదాల ఆరోగ్యం, వ్యక్తిగత ఎంపికలపై ఆధారపడి ఉంటుంది. కొంత మంది రాత్రిపూట మంచి నిద్ర కోసం సాక్స్ వేసుకుంటారు. ఎందుకంటే మనం నిద్రించే సమయంలో శరీరం చల్లబడుతుంది. అటువంటి పరిస్థితిలో సాక్స్ ధరించడం వల్ల వెచ్చగా ఉంటుంది. అయితే చలికాలంలో సాక్స్‌తో నిద్రించడం వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. అప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి.

ప్రయోజనాలు, నష్టాలు ఏమిటంటే?

చలికాలంలో సాక్స్ వేసుకుని పడుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. పాదాల చర్మం గరుకుగా, పొడిబారకుండా రక్షించడానికి వీటిని ధరిస్తారు. పాదాల పగుళ్లను కూడా నయం చేసుకోవచ్చు. కానీ వాస్తవానికి శీతాకాలపు రాత్రులలో సాక్స్‌లో నిద్రించడం వల్ల ప్రయోజనాల కంటే ఎక్కువ ప్రతికూలతలూ ఉన్నాయి. దీని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

రక్తనాళాలపై ప్రభావం

చలికాలంలో రాత్రిపూట సాక్స్‌తో నిద్రించడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఉన్ని సాక్స్ లేదా చాలా వేడి బట్టలు ధరించి నిద్రించడం మంచిది కాదు. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే విశ్రాంతి లేకపోవడం, ఆందోళన, రక్తపోటు తగ్గడం వంటి సమస్యలు పెరుగుతాయి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

రాత్రిపూట బిగుతుగా ఉండే సాక్స్‌లు వేసుకుని నిద్రపోవడం వల్ల నరాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

చర్మ సమస్యల సంక్రమణ

రోజంతా సాక్స్ వేసుకుని రాత్రి పడుకుంటే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇతర చర్మ సంబంధిత సమస్యలకు కూడా దారితీయవచ్చు.

రక్త ప్రసరణ

రాత్రిపూట సాక్స్‌లో పడుకోవడం వల్ల శరీరానికి రక్త ప్రసరణ తగ్గిపోయే ప్రమాదం ఉంది. చాలా బిగుతుగా ఉండే సాక్స్ ధరించడం వల్ల రక్త ప్రసరణ దెబ్బతింటుంది. కాబట్టి సాక్స్ ధరించే ముందు ఆలోచించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.