Health Tips: భోజనం తర్వాత పండ్లు తినకూడదా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారంటే..

| Edited By: Anil kumar poka

Jul 01, 2022 | 9:02 AM

Fruit After Meals: పండ్లలో మరే ఇతర ఆహారంలో లేని కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లను అందిస్తాయి. అలాగే బరువు తగ్గించడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని కూడా అందిస్తాయి. అయితే..

Health Tips: భోజనం తర్వాత పండ్లు తినకూడదా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Fruits
Follow us on

Fruit After Meals: పండ్లలో మరే ఇతర ఆహారంలో లేని కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లను అందిస్తాయి. అలాగే బరువు తగ్గించడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని కూడా అందిస్తాయి. అయితే పండ్లను సరైన సమయానికి తినాలని, లేకుంటే గుండె సమస్యలకు దారితీస్తుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పండ్లను భోజన సమయానికి అరగంట ముందు తినాలని వారు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే పండ్లలో ఫైబర్ మరియు పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి జీర్ణక్రియకు బాగా సహాయపడతాయి. ఇక అన్ని పండ్లలోనూ ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు పండ్లను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయ సమస్యలు వస్తాయట. ఇక భోజనాల మధ్య పండ్లను తీసుకోవడం వల్ల ఆకలి తగ్గడమే కాకుండా శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరుగుతుంది.

బ్రేక్‌ఫాస్ట్‌లో..

ఇక అల్పాహారం కోసం పండ్లు తినడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యోగర్ట్‌, పీచెస్, బెర్రీలు, యాపిల్స్ వంటి తక్కువ క్యాలరీలున్న పండ్లను బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవచ్చు. ఇక పండ్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ జ్యూస్ మరియు తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. చక్కెర స్థాయిలలో ఆకస్మిక మార్పును నివారించడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (GI) ఉన్న పండ్లను తినాలి. జామునో, స్ట్రాబెర్రీ, రేగు, నారింజ వంటి పండ్లలో అతి తక్కువ జీఐ ఉంటే, మామిడిలో అత్యధిక జీఐ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సీతాఫలం

సీతాఫలంలో పొటాషియం, ఫైబర్ మరియు విటమిన్ బి6 పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా, సీతాఫలం అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఇలాంటప్పుడు ఇంట్లోనే పండించే సీతాఫలాన్ని తీసుకోవడం ద్వారా మరిన్ని లాభాలను పొందవచ్చు.

ఆరెంజ్

క్రమం తప్పకుండా ఆరెంజ్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలో రక్తపోటును నియంత్రించగలదు. మలబద్ధకం ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఈ పండులోని విటమిన్ సి ఆరోగ్యానికి చాలా మంచిది.

అరటిపండు

జీర్ణక్రియ సమస్యల పరిష్కారానికి అరటిపండు మంచిది. జీర్ణశక్తిని మెరుగుపరిచేందుకు అరటిపండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే భోజనం చేసిన వెంటనే అరటిపండు తినడం మంచిది. అరటిపండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..