Heart: గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత వ్యాయామం చేయకూడదా.? నిపుణులు ఏమంటున్నారంటే..

దీంతో గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఎలాంటి పనులు చేయాలి.? ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలపై చాలా మందిలో ఎన్నో అపోహలు ఉంటాయి. అలాంటి అనుమానాల్లో గుండెపోటు వచ్చిన వారు వ్యాయామం చేయాలా.? వద్ద అనేది ఒకటి. సాధారణంగా గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యాయామం...

Heart: గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత వ్యాయామం చేయకూడదా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Heart Health
Follow us

|

Updated on: Aug 01, 2024 | 10:55 AM

తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, మారిన జీవన విధానం, తగ్గిన శారీరక శ్రమ కారణం ఏదైనా.. ఇటీవల గుండె పోటు బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తక్కువ వయసుఉన్న వారు కూడా గుండెపోటుతో మరణిస్తుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అయితే సకాలంలో గుండెపోటు సమస్యను గుర్తిస్తే ప్రాణాల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఒకసారి గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత వ్యక్తి జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. అతను తీసుకునే ఆహారం మొదలు, రోజువారీ పనుల విషయంలో మార్పులు చేసుకోవాల్సిందే.

దీంతో గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఎలాంటి పనులు చేయాలి.? ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలపై చాలా మందిలో ఎన్నో అపోహలు ఉంటాయి. అలాంటి అనుమానాల్లో గుండెపోటు వచ్చిన వారు వ్యాయామం చేయాలా.? వద్ద అనేది ఒకటి. సాధారణంగా గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతుంటారు. అదే ఒకవేళ గుండెపోటు నుంచి కోలుకున్న వారు వ్యాయామం చేయాలా.? లేదా అన్న విషయం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత వీలైనంత వరకు హెవీ వర్కవుట్స్‌ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత వ్యాయామం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. హెవీ వర్కవుట్స్‌ చేయడం వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ బరువులు మోయడం, వేగంగా పరిగెత్తడం లాంటి వాటికి దూరంగా ఉండాలి. నెమ్మదిగా నడవంతో వ్యాయామాన్ని ప్రారంభించాలి. ఆ తర్వాత క్రమంగా వేగం పెంచుకోవచ్చు. అలాగే యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.

అయితే గుండెపోటు వచ్చిన తర్వాత వ్యాయామం చేసే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత ప్రజలు లేని చోట కాకుండా కాస్త బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్ చేయడం మంచిది. నడుస్తున్న సమయంలో ఎక్కువ ఆయాసం వచ్చినా, చెమటలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం సూచించదగ్గ అంశంగా చెప్పొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి నిపుణులు సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..