
1980లలో తైవాన్‌లో బబుల్ టీని తయారు చేశారు. ఇది పాలు, టీ, చక్కెర సిరప్, టేస్టీ టపియోకా బాల్స్‌తో తయారు చేస్తారు. ఈ నల్లటి టపియోకా బాల్స్ వల్లే ఈ టీకి బోబా టీ అని పేరు వచ్చింది. వీటిని కర్రపెండలం దుంపతో తయారుచేస్తారు. వివిధ రకాల పండ్ల ఫ్లేవర్లతో తయారుచేసిన ఈ టీలో.. నానబెట్టిన టాపియోకా గింజలని వేసి తయారుచేస్తారు. పైన జెల్స్‌తో చేసిన టాపింగ్స్ వేస్తారు. దీంతో ఈ టీకీ మరింత అందంగా, రుచిగా మారుస్తుంది. ఈ టాపియోకాలని తినడానికి వీలుగా ఇందులో వేసే స్ట్రాలు కూడా ప్రత్యేకంగా, లావుగా ఉంటాయి. తైవాన్‌లో ప్రాచుర్యం పొందిన ఈ టీ ఇప్పుడు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోంది.
కానీ, ఇటీవల, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో బోబా టీ అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ఆయన వివరంగా చెప్పారు. బోబా టీ అధికంగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్, ఊబకాయం, డయాబెటిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయన వివరించారు.
బబుల్ టీ ఎలా తయారు చేస్తారు?
బబుల్ టీ తయారు చేయడానికి, టపియోకా బాల్స్‌ని ముందుగా ఉడకబెట్టి వాటిని మృదువుగా, నమలడానికి ఈజీగా ఉండేలా చేస్తారు. తరువాత, టీ బేస్ తయారు చేస్తారు. ఇందులో సాధారణంగా బ్లాక్ టీ, గ్రీన్ టీ లేదా మిల్క్ టీ ఉంటాయి. చక్కెర సిరప్, పాలు, పలు రకాల ఫ్లేవర్స్‌ని యాడ్ చేస్తారు. . చివరగా, ఈ వేడి టపియోకా బాల్స్‌ని ఒక కప్పు అడుగున ఉంచి, టీ మిశ్రమాన్ని పైన పోస్తారు. బోబా బాల్స్ ప్రతి సిప్‌తో నోటిలోకి వచ్చేలా దీన్ని పెద్ద స్ట్రాతో తాగుతారు.
బబుల్ టీ మీ ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్ వివరణ
అమెరికాకు చెందిన హార్వర్డ్‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ఇటీవల ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో బబుల్ టీ అనారోగ్యకరమైనది మాత్రమే కాదు, కాలేయానికి కూడా హానికరం అని వివరించారు. యువతలో ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణంగా మారుతోందని చెప్పారు.. మీడియం సైజు బబుల్ టీలో దాదాపు 30 నుండి 55 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది కోకా-కోలా డబ్బా కంటే ఎక్కువ. కారామెల్ డ్రిజిల్, ఫ్రూట్ జెల్లీ లేదా సిరప్ వంటి టాపింగ్స్‌ను వేయటం వల్ల చక్కెర శాతం మరింత పెరుగుతుంది. ఈ అదనపు చక్కెర ఇన్సులిన్ స్పైక్‌లు, కొవ్వు నిల్వ, మొటిమలకు దారితీస్తుంది.
వీడియో ఇక్కడ చూడండి…
డాక్టర్ సేథి ప్రకారం, ప్రతిసారి అధిక చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రమాదం పెరుగుతుంది. శరీరం అదనపు చక్కెరను జీర్ణం చేసుకోలేనప్పుడు, అది కాలేయంలో కొవ్వుగా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీస్తుంది. బబుల్ టీలో చక్కెర మాత్రమే కాకుండా కృత్రిమ రుచులు, రంగులు, ప్రిజర్వేటివ్‌లు కూడా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలంలో బరువు పెరగడానికి కారణమవుతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్, ఊబకాయం, మొటిమల వంటి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీరు బబుల్ టీని అలవాటుగా చేసుకుంటే మాత్రం వెంటనే మానేయండి..అప్పుడప్పుడు తీసుకునే ట్రీట్‌గా మాత్రమే దీన్ని ఆస్వాదించండి. మీరు కావాలనుకుంటే సిరప్ లేకుండా, తక్కువ పాలు, ఎక్కువ గ్రీన్ టీతో తక్కువ చక్కెర వెర్షన్‌ను తయారు చేసుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..