మన దేశంలో అత్యధిక శాతం పాశ్చాత్య సంస్కృతి ఉండే ప్రాంతం గోవా. మన దేశంలోని పర్యాటకలతో పాటు విదేశీయులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి వస్తుంటారు. నగరం చుట్టూ అందమైన తెల్ల ఇసుక బీచ్‌లు, చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ప్రకృతి రమణీయత అంతా అందిరినీ విశేషంగా ఆకర్షిస్తుంది. చాలా మంది బెస్ట్ హాలిడే, హనీమూన్ స్పాట్‌గా భావిస్తారు. అలాంటి ప్రదేశానికి వెళ్లడానికి, అక్కడి అందాలు ఆస్వాదించడానికి చాలా మంది ఇష్టపడతారు. మీరు అలాంటి ఆలోచనలతో ఉంటే మీకో గుడ్‌న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజమ్ విభాగం గోవా టూర్ కోసం ప్రత్యేకమైన ప్యాకేజీని అందిస్తోంది. ‘గోవా రిట్రీట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్యాకేజీలో గోవాలోని అన్ని ప్రసిద్ధ ప్రాంతాలను చుట్టేసి రావొచ్చు. విమానంలో వెళ్లి వచ్చే ఈ ప్యాకేజీ ధరలు రూ. 21, 805 నుంచి ప్రారంభవమవుతాయి. నవంబర్ 2, 11 తేదీల్లో టూర్ హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మొదలవుతుంది. మూడు రాత్రిళ్లు, నాలుగు పగళ్లు ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ టూర్ ప్యాకేజీ తీసుకుంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. మూడు రాత్రిళ్లు, నాలుగు పగళ్లు ఉంటుంది. నవంబర్ 2వ తేదీన ఒక బ్యాచ్, నవంబర్ 11న మరో బ్యాచ్ వెళ్తుంది. ఈ టూర్‌లో సౌత్ గోవా, నార్త్ గోవాలోని పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, చర్చిలు, ఆలయాలు కవర్ అవుతాయి.
ఈ టూర్ ప్యాకేజీలు రూ. 21,805 నుంచి ప్రారంభమవుతాయి. ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికీ రూ. 21,805, డబుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికీ రూ. 21,930, సింగిల్ షేరింగ్ అయితే రూ. 27,650 చార్జ్ చేస్తాయి. పిల్లలకు ప్రత్యేకంగా చార్జ్ చేస్తారు. ఆ ప్యాకేజీలో ప్రయాణ చార్జీలతో ఏసీ హోటల్ వసతి కల్పిస్తారు. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం, వసతి కల్పిస్తారు. గోవాలో లోకల్ ప్రయాణాలకు ఏసీ వాహన సదుపాయం ఉంటుంది. మధ్యాహ్నం భోజనంతో పాటు ఇతర పానీయాలు, చిరుతిళ్లను పర్యాటకులే భరించాలి. ఐఆర్‌సీటీసీ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. పర్యాటకులకు ట్రావెల్ ఇన్సురెన్స్ సదుపాయం ఉంటుంది. మరిన్ని వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి అందులో టూర్ ప్యాకేజీల ఆప్షన్లో గోవా రిట్రీట్ ప్యాకేజీని ఎంపిక చేసుకొని వివరాలు తెలుసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..