AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rava Dosa: హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే కరకరలాడే రవ్వదోశ ఇలా చేసుకొని తింటే.. ఆహా అనాల్సిందే

సాదారణంగా దోశలు వేయాలంటే.. రాత్రి బియ్యం నానబెట్టి, వాటిని గ్రైండ్ చేసి పిండి పులియపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే రెపీకి మిక్సీ లేదా గ్రైండర్ అవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణమే దోశలను మీరు సులభంగా వేసుకోవచ్చు. ఇందుకు రవ్వ, గోదుమ, బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. క్షణాల్లో కరకరలాడే రవ్వ దోసను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Rava Dosa: హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే కరకరలాడే రవ్వదోశ ఇలా చేసుకొని తింటే.. ఆహా అనాల్సిందే
Instant Rava Dosa Recipe
Anand T
|

Updated on: Apr 06, 2026 | 8:49 PM

Share

మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోశ తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. కానీ దాన్ని చేసుకునేందుకు ముందురోజు రాత్రి బియ్యం నానబెట్టి.. వారిని రుబ్బి పులియపెట్టడం అంటే పెద్ద టాస్క్‌ అనుకుంటారు. అందుకే తమ ఇష్టాన్ని చంపుకొని బ్రేక్‌పాస్ట్‌లోకి ఏదో ఒకటి తినేస్తారు. అలాంటి వారి కోసమే ఈ రెసిపీ.. ఇప్పుడు మీరు గ్రైండర్ అవసరం లేకుండానే క్షనాల్లో కరకరలాడే దోశలను క్షణాల్లో వేసుకోవచ్చు. అవురు రవ్వతో నిమిషాల్లోనే మనకు కావాల్సిన దోశలను బ్రేక్‌ఫాస్ట్‌లోకి రెడీ చేసుకోవచ్చు. ఇంట్లోనే సింపుల్‌గా హోటల్‌ స్టైల్ రవ్వ దోశలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రవ్వదోశకు కావాల్సిన పదార్థాలు

  • బొంబాయి రవ్వ: ఒకటిన్నర గ్లాసులు
  • మైదా పిండి: ఒక గ్లాసు
  • బియ్యం పిండి: ఒక గ్లాసు
  • జీలకర్ర: ఒక స్పూను (సుమారు 5-10 గ్రాములు)
  • ఉప్పు: ఐదు నుండి ఎనిమిది గ్రాములు (రుచికి సరిపడా)
  • నీరు: తగినంత

తయారీ విధానం:

ముందుగా, ఒక పెద్ద గిన్నెలో ఒకటిన్నర గ్లాసు బొంబాయి రవ్వ, ఒక గ్లాసు మైదా పిండి, ఒక గ్లాసు బియ్యం పిండిని తీసుకోండి. ఈ పొడి పదార్థాలలో ఒక స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినంత నీటిని కొద్దికొద్దిగా పోస్తూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా, చారు లాగా లూజ్‌గా ఉండాలి. ఈ పలచదనం దోస కరకరలాడేలా చేస్తుంది.

దోస పెంకాన్ని వేడి చేసి, మంటను నెమ్మదిగా ఉంచాలి. దోస కరకరలాడేలా కాలడానికి తక్కువ మంట అవసరం. పిండిని పెనంపై పల్చగా పోసి, సమానంగా విస్తరించండి. దీనిని నెమ్మదిగా కాల్చాలి. దోస గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారి, అంచులు పైకి లేచినప్పుడు, అది సరిగ్గా కాలినట్లు అర్థం. ఇంట్లో సాధారణ పెనంపై అయితే ఐదు నిమిషాల్లో, పెద్ద పెనంపై అయితే 15-20 నిమిషాల్లో కాలుతుంది.

ముఖ్యమైన చిట్కాలు:

క్రిస్పీ దోస కోసం: రవ్వ దోస కరకరలాడాలంటే, మైదా, బియ్యం పిండితో పోలిస్తే రవ్వ ఎక్కువ ఉండాలి. మనం సూచించిన ఒకటిన్నర గ్లాసు రవ్వ, ఒక గ్లాసు మైదా, ఒక గ్లాసు బియ్యం పిండి నిష్పత్తి దోసను పర్‌ఫెక్ట్‌గా చేస్తుంది. రవ్వ తక్కువైతే దోస అతుక్కుపోయే అవకాశం ఉంది. పిండిని మరీ చిక్కగా చేయకూడదు, చారు మాదిరిగా పల్చగా ఉండాలి, కానీ మరీ నీళ్లలా కాకుండా చూసుకోవాలి. కాల్చేప్పుడు కూడా తక్కువ మంటపై నెమ్మదిగా కాల్చడం వల్ల దోస కరకరలాడుతూ, బంగారు రంగులోకి వస్తుంది.

ఈ రెసిపీతో ప్లెయిన్ రవ్వ దోస, ఆనియన్ రవ్వ దోస సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు వేసి, లేదా మసాలా రవ్వ దోసలను సులభంగా తయారు చేసుకోవచ్చు. అల్లం ముక్కలు వేయడం వల్ల దోస రుచి మరింత పెరుగుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us