Inspiring Story: కృషి, పట్టుదల ఉంటే వైకల్యం సక్సెస్ కు అడ్డుకాదని నిరూపించిన యువతి..

|

Jul 30, 2022 | 10:25 AM

హన్నా కి దృష్టి లోపం ఉంది. అయితే చదువుకు తన లోపం అడ్డంకాదు అనుకుంది. పట్టుదలతో చదివి.. USలోని ఇండియానాలోని నోట్రే డామ్ యూనివర్సిటీలో  స్కాలర్‌షిప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించి.

Inspiring Story: కృషి, పట్టుదల ఉంటే వైకల్యం సక్సెస్ కు అడ్డుకాదని నిరూపించిన యువతి..
Hannah Alice Simon
Follow us on

Inspiring Story: కృషి, పట్టుదల ఉంటే చాలు.. తాము కన్న కలలను సాకారం చేసుకోవడానికి ఏ వైకల్యాలు అడ్డు కావని నిరూపించిందో ఓ యువతి. హ్యుమానిటీస్‌లో సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షల్లో 500 మార్కులకు 496 మార్కులను సొంతం చేసుకుంది. దేశంలోనే వికలాంగ విద్యార్థుల విభాగంలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది 19 ఏళ్ల హన్నా ఆలిస్ సైమన్. అంతేకాదు.. ఇప్పుడు ఉన్నత చదువులు చదివి.. తన కలలను సాకారం చేసుకోవడానికి అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లింది. అదీ కూడా స్కాలర్ షిప్ ను సొంతం చేసుకుని.. పై చదువుల కోసం విదేశీ బాట పట్టిన కేరళ కుట్టి.

హన్నా కి దృష్టి లోపం ఉంది. అయితే చదువుకు తన లోపం అడ్డంకాదు అనుకుంది. పట్టుదలతో చదివి.. USలోని ఇండియానాలోని నోట్రే డామ్ యూనివర్సిటీలో  స్కాలర్‌షిప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించి. ఈ స్కాలర్ షిప్ ను గెలుచుకున్న ఏకైక కేరళీయురాలుగా హన్నా నిలిచింది. ప్రతిభావంతురాలైన హన్నా సైకాలజీలో అత్యుత్తమ కోర్సును అభ్యసించడానికి స్కాలర్‌షిప్‌ను పొందడానికి ఉపయోగపడిందని హన్నా తల్లి లిజా సైమన్ అన్నారు.

“హన్నా ఎప్పుడూ యుఎస్‌లో ఉన్నత చదువులు చదవాలని కలలు కనేది. దీంతో హన్నా తల్లి కెనడా, ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాల్లో తన కూతురిని చదివించాలని ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే ఈ దేశాల్లోని ఉన్నత చదువులకు తక్కువ ఖర్చు అవుతుంది.. అయితే ఆ దేశాల్లోని యూనివర్సిటీలు హన్నాను చేర్చుకోవడానికి నిరాకరించాయి. హన్నా మాత్రం యూఎస్‌లో చదువుకోవాలనుకుంది. యుఎస్ లో యూనివర్సిల్లో ప్రవేశ పరీక్ష కోసం హన్నా ప్రిపేర్ అవ్వడంమొదలుపెట్టింది. కఠిన మైన ప్రవేశ పరీక్ష నిమిత్తం హన్నా సన్నాహాలు మొదలు పెట్టింది.

ఇవి కూడా చదవండి

కమ్యూనిటీ సర్వీసెస్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ , ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం సంపాదించింది. అంతేకాదు మరోవైపు  IX, X , ప్లస్-వన్ తరగతుల్లో మార్కులకు పాయింట్లు కూడా కలిశాయి. హన్నా లండన్లోని ట్రినిటీ కాలేజ్ నుండి వెస్ట్రన్ వోకల్, క్లాసికల్, రాక్ రెండింటిలోనూ ఎనిమిదో తరగతి పూర్తి చేసింది, అంతేకాకుండా అనాథ పిల్లలతో కలిసి పని చేసింది. ఇవన్నీ హన్నాకు యుఎస్ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్షకు అదనపు అర్హతగా నిలిచాయి. దీంతో నోట్రే డామ్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ లో అర్హత సాధించిన 14 మందిలో పూర్తి స్కాలర్‌షిప్ పొందిన ఏకైక విద్యార్థిగా హన్నా నిలిచింది” అని లిజా చెప్పారు.

హన్నా తనకు ఎదురైనా హర్డిల్స్ ను తల్లిదండ్రులు, స్నేహితుల సాయంతో దాటించింది. తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది. ఇప్పుడు అమెరికాలో చదువుల కోసం వెళ్ళింది. చిన్న చిన్న కారణాలతో నిరాశకు గురయ్యేవారికి హన్నా ఒక ఆదర్శ యువతి.. కళ్ళు లేకపోయినా మనసునే కళ్ళుగా చేసుకుని.. పట్టుదలతో తాను నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. దీంతో హన్నా పై సర్వత్రా ప్రశంసల హర్షం కురుస్తోంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..