Parenting Tips: భలే చెప్పారు.. పేరెంటింగ్ గురించి ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి సూపర్‌ టిప్‌

|

Sep 10, 2024 | 6:09 PM

ఇక నిత్యం వార్తల్లో ఉండే మూర్తి గతంలో ఓసారి దేశంలో యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో దీనినై భిన్నమైన వాదనలు వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా బెంగళూరులో జరిగి ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ మూర్తి పేరెంటింగ్ గురించి వివరించిన అంశాలు ఆకట్టుకుంటున్నాయి...

Parenting Tips: భలే చెప్పారు.. పేరెంటింగ్ గురించి ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి సూపర్‌ టిప్‌
Narayana Murthy
Follow us on

ప్రముఖ దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కేవలం వ్యాపారానికి మాత్రమే సంబంధించి కాకుండా ఇతర సాధారణ అంశాలపై కూడా స్పందించే మూర్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. కొన్ని రూ. కోట్లకు అధిపతి అయినా నిరాడంబరత జీవితాన్ని సాగిస్తుంటారు నారాయణ మూర్తి.

ఇక నిత్యం వార్తల్లో ఉండే మూర్తి గతంలో ఓసారి దేశంలో యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో దీనినై భిన్నమైన వాదనలు వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా బెంగళూరులో జరిగి ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ మూర్తి పేరెంటింగ్ గురించి వివరించిన అంశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇంట్లో పిల్లలు చదువుకునే వాతావరణాన్ని సృష్టించే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. పిల్లలకు కేవలం సూచనలు ఇవ్వడమే కాకుండా వారికి మంచి రోల్ మోడల్‌గా ఉండాలని మూర్తి తెలిపారు.

తల్లిదండ్రులు తాము సినిమాలు చూస్తూ.. పిల్లలను చదవమని అడగడం సరైంది కాదని మూర్తి చెప్పుకొచ్చారు. చాలా మంది పేరెంట్స్‌ పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, బ్యాగులు కొనించడంతోనే తమ బాధ్యత ముగుస్తుందని భావిస్తుంటారు కానీ వారు చదువుకోవడానికి కావాల్సిన సరైన వాతావరణాన్ని కల్పించే బాధ్యత కూడా పేరెంట్స్‌దే అన్న అర్థం వచ్చేలా మూర్తి మాట్లాడారు.

ఈ సందర్భంగా మూర్తి ఇంకా మాట్లాడుతూ.. తమ పిల్లలు చదువకునే సమయంలో భార్య సుధా మూర్తి పిల్లలను చదివించేందుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం కేటాయించే వారిని గుర్తు చేసుకున్నారు. ఇది పిల్లలు అధ్యయనానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు సహాయపడిందని తెలిపారు. పిల్లలు చదువుకునే సమయంలో ఇంట్లో ఎవరూ టీవీ చూసేవారు కాదని తెలిపారు. ‘నేను టీవీ చూస్తుంటే, నా పిల్లలను చదువుకోమని చెప్పలేను. అందుకే టీవీ టైమ్‌ని త్యాగం చేస్తానని’ సుధామూర్తి అనేవారని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. ఇక సుధామూర్తి సైతం గతంలో ఇలాంటి ఎన్నో మంచి విషయాలను తెలిపారు. తమ పిల్లలను క్రమశిక్షణలో ఎలా పెంచారో వివరిస్తూ ఎన్నో ఉదాహరణలు తెలిపారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..