Importance of Sleep: మీ వయస్సును బట్టి.. మీరు ఎంత సేపు నిద్రపోవాలో ఇక్కడ తెలుసుకోండి!

మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. రాత్రి ఎంత హాయిగా పడుకుంటే నెక్ట్స్‌ డే అంత ఆహ్లాదకంగా ఉంటుంది. అలాగే మనం యాక్టీవ్‌గా కూడా ఉంటాం. ఒకవేళ రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే మీ శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. కాబట్టి ఏ వయస్సు వారు ఎంత సమయం నిద్రపోవాలి, ఆ నిద్ర వాళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇక్కడ తెలుసుకుందాం.

Importance of Sleep: మీ వయస్సును బట్టి.. మీరు ఎంత సేపు నిద్రపోవాలో ఇక్కడ తెలుసుకోండి!
Good Sleep

Updated on: Sep 11, 2025 | 4:38 PM

సాధారణంగా ఒక యువకుడు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలని చెబుతారు. అయితే ఒక్కో ఏజ్‌ గ్రూప్‌ వారికి ఒక్కో నిద్ర షెడ్యూల్‌ ఉంటుందనే విషయం మీకు తెలుసా? అవును మన వయస్సును బట్టి మనకు ఎంత నిద్ర అవసరమో వైద్య నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. మూడు నెలల లోపు నవజాత శిశువులు 14 నుండి 17 గంటలు నిద్రపోతావాలి. లేదంటే వారి ఆరోగ్యంపై నిద్ర ప్రభావితం పడుతుంది. అలాగే నాలుగు నుండి 11 నెలల వయస్సు గల పిల్లలు 12 నుండి 15 గంటలు పాటు నిద్రపోవాలి. దీన్ని తగ్గించడం మంచిది కాదు. ఒకటి నుండి రెండు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రతిరోజూ 11 నుండి 14 గంటలు నిద్ర అవసరం.

మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు 10 నుండి 13 గంటలు నిద్రపోవాలి. ఈ వయస్సులో పిల్లలు చాలా నేర్చుకుంటారు. అర్థం చేసుకుంటారు, కాబట్టి వీళ్లకు విశ్రాంతి తప్పనిసరి. ఆరు నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ప్రతిరోజూ తొమ్మిది నుండి 12 గంటలు నిద్రపోవాలి. వారు పాఠశాలకు వెళ్లే పిల్లలు కాబట్టి, వారికి అవసరమైన నిద్ర వచ్చేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి: నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనూ GHMC సేవలు!

ఇవి కూడా చదవండి

13 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ఎనిమిది నుంచి పది గంటలు నిద్రపోవాలి. టీనేజర్లుగా వారి శరీరాలు, మనస్సులు గణనీయమైన మార్పులకు గురవుతున్న సమయం ఇది. కాబట్టి, ఈ దశలో వారికి మితమైన విశ్రాంతి అవసరం. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం. వీరు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి: మీరు వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకుంటున్నారా?.. ఈ ఫుడ్స్‌ జోలికి అస్సలు వెళ్లకండి!

61 ఏళ్లు పైబడిన వారు రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. వృద్ధులు తక్కువ నిద్రపోయే అవకాశం ఉంది. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి, మీరు తగినంత నిద్ర పొందుతున్నారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.

NOTE: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఇవ్వబడినవి. కాబట్టి వీటిలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించండి.

ఇవి కూడా చదవండి: గూగుల్‌ యూజర్స్‌కు బంపరాఫర్.. సేల్‌లో పిక్సెల్-9పై భారీ డిస్కౌంట్.. ధర తెలిస్తే!

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.