మన ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడుకోవడానికి శరీరంలోని రోగనిరోధక శక్తి ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే అనేక వ్యాధులతో మనం బాధపడవలసి ఉంటుంది. అయితే శీతాకాలం ప్రారంభం అంటేనే అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు మనల్ని వెంటాడడం మొదలవుతుంది. ఫలితంగానే చలికాలంలో జలుబు, దగ్గు లేదా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని రకాల జాగ్రత్తలను పాటిస్తే సరిపోతుంది. ఆ క్రమంలోనే రమనం పాటించవలసిన ముఖ్యమైన నియమం ఆహారమార్పు. సీజన్‌కు తగినట్లుగా మనం మన ఆహారపు అలవాట్లను పాటించాలి. అలా చేయడం వల్ల మనం మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే కాక ఆరోగ్యాన్నికూడా కాపాడుకోవచ్చు. శీతాకాలంలో మన రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనకరంగా పనిచేసే మూడు రకాల వంటకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శీతాకాలంలో ఆరోగ్యం కోసం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం అల్లం క్యారెట్ సూప్ ఉత్తమమైన ఎంపిక. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్‌తో పాటు అల్లంలోని గుణాలు మనకు బాగా ఉపకరిస్తాయి. కంటి సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు కూడా క్యారెట్‌లోని పోషక గుణాలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే బీటా కెరోటిన్ ఇన్ఫెక్షన్‌ను దూరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అల్లం-క్యారెట్ సూప్‌లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్‌లను నివారిస్తాయి.
మూంగ్ పప్పు, కొబ్బరి మరియు కివితో చేసిన సూప్ మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కివిలో విటమిన్ సీ పుష్కలంగా ఉండడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మూంగ్ పప్పులో పుష్కలంగా ఉండే ప్రోటీన్ మనల్ని చాలా కాలం పాటు ఆకలి నుంచి సంతృప్తిగా ఉంచుతుంది. దీనికి లవంగాలు, ఎండుమిర్చి, పసుపు వంటి మసాలా దినుసులు జోడించడం వల్ల రోగనిరోధక శక్తి మరింతగా పెరుగుతుంది.
మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్‌లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ సూప్‌లో మీకు నచ్చిన కూరగాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి సూప్ చేసుకోవచ్చు. ఈ సూప్ రుచికరమైనదిగా ఉండడమే కాక రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ..