ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు పెరగడం ఎంతో సులభమో.. తగ్గడం అంత కష్టం. బరువు తగ్గాలి అనుకునే వారు మంచి డైట్ తీసుకోవడంతో పాటు.. వ్యాయామం కూడా చేయాలి. అలాగే ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవడం కంట్రోల్ చేయాలి. అలా అయితేనే మీరు త్వరగా బరువు తగ్గగలరు. లేదంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తుంటే.. మీ కోసమే హెల్దీ డైట్‌ని మీ కోసం తీసుకొచ్చాం. ఇవి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. వీటిని ఫాలో చేస్తూ.. వ్యాయామం చేస్తే.. మీకు నెల రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. మరి ఇంకెందుకు లేట్ చూసేయండి.
ఇండియన్ ఫుడ్‌లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఫుడ్సే ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తున్నవారు.. కార్బోహైడ్రేట్స్ ఆహారం చాలా తక్కువగా తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వడమే కాకుండా.. డయాబెటీస్ కూడా వస్తుంది. అన్నం తక్కువగా తినండి. కూరలు ఎక్కువగా తీసుకోండి.
మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు. కాబట్టి.. తక్కువగా తిన్నా పొట్ట నిండాలి. అలాంటప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇందులో పండ్లు, కూరగాయలు కూడా వస్తాయి. ఇవి ఎలానో ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి.. పండ్లు తింటూ ఉండండి.
వెయిట్ లాస్ అయ్యేవాళ్లు దోశ, ఇడ్లీ, పొంగల్, పూరీ, బజ్జీలు వంటివి అస్సలు తీసుకోవద్దు. వీటి వల్ల ఆకలి అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోండి. ఉదయం గుడ్డు, పెరుగు, పండ్లు, నట్స్ వంటివి తినడం బెటర్.
బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తున్నారు.. బియ్యం, నూనె, బేకరీ ఫుడ్స్, బ్రెడ్, పాస్తా. ట్రాన్స్ ఫ్యాట్స్, చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్, తీపి పదార్థాలు, డీప్ ఫ్రై ఫుడ్స్‌ని అస్సలు తీసుకోవద్దు. వీటి వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది విపరీతంగా పెరిగి పోతుంది. అదే విధంగా వ్యాయామం చేస్తే మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..