Skin Care : చర్మం మెరుస్తూ ఉండాలంటే ఈ 3 తప్పులు అస్సలు చేయొద్దు..! ఏంటో తెలుసుకోండి..

Skin Care : ఆరోగ్యకరమైన స్కిన్ కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. ఏదో విధంగా ముఖాన్ని అందంగా మార్చుకున్నా దానిని కాపాడుకోలేరు.

Skin Care : చర్మం మెరుస్తూ ఉండాలంటే ఈ 3 తప్పులు అస్సలు చేయొద్దు..! ఏంటో తెలుసుకోండి..
Skin Care

Updated on: Jul 19, 2021 | 8:52 PM

Skin Care : ఆరోగ్యకరమైన స్కిన్ కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. ఏదో విధంగా ముఖాన్ని అందంగా మార్చుకున్నా దానిని కాపాడుకోలేరు. ఎందుకంటే వారికి తెలియకుండా చేసే తప్పుల వల్ల ఇది జరుగుతుంది. ఆరోగ్య కరమైన ముఖం కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. చర్మం నిత్యం యవ్వనంగా మెరుస్తూ ఉండాలంటే ఈ మూడు తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. తగినంత నీరు తాగకపోవడం- మీ చర్మం అన్ని సమస్యలను తొలగించడంలో నీరు బాగా ఉపయోగపడుతుంది. మీరు తగినంత నీరు తాగినప్పుడు ఇది మీ శరీరం నుంచి వచ్చే టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. కొన్ని రోజులు తగినంత నీరు తాగండి మీరే తేడా గమనిస్తారు. సహజమైన గ్లో కూడా వస్తుంది.

2. మేకప్‌తో నిద్రపోవడం – ఈ రోజుల్లో అందరూ మేకప్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ మీరు నిద్రపోయే ముందు దానిని తొలగించుకోకపోతే అది మీ చర్మాన్ని పాడు చేస్తుంది. నిద్రపోయే ముందు మొదట మీ ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోండి. ఇది మీ చర్మ రంధ్రాలకు గాలి తగిలేలా చేస్తుంది. తద్వారా మంచి గ్లో ఏర్పడుతుంది. అందుకే నిద్రపోయే ముందు ప్రతిరోజూ మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

3. ముఖాన్ని తరచూ కడగడం – మీ ముఖాన్ని కడగడం, స్క్రబ్ చేయడం ఆరోగ్యకరమైనది. అయితే చాలాసార్లు కడిగితే ముఖం తేమను కోల్పోతుంది. దీంతో మీ చర్మం పొడిగా తయారవుతుంది. అవసరమైతే రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ముఖం కడగాలి. కానీ ప్రతి గంటకు ముఖం కడుక్కోకూడదు. అదేవిధంగా మీ ముఖాన్ని తరచూ స్క్రబ్ చేయడం వల్ల మీ చర్మం జీవం లేనిదిగా కనిపిస్తుంది. అధిక స్క్రబ్బింగ్ మీ చర్మాన్ని దెబ్బతీస్తుంది.

Monsoon Diet : వర్షాకాలంలో వ్యాధులను నివారణకు ఈ 5 ఆహారాలు కచ్చితంగా మీ డైట్‌లో ఉండాల్సిందే..

ప్రపంచంలోనే అత్యంత డేంజర్ సరస్సు..! నీరు తేటగా ఉంటాయి కానీ తాగారంటే మరణమే..

Kota Srinivasa Rao: జబర్ధస్త్, బిగ్ బాస్ షోలపై, అందులోని ఆర్టిస్టులపై సంచలన కామెంట్స్ చేసిన విలక్షణ నటుడు