రోజూ ఒక గ్లాసు పాలు క్యాన్సర్ నుండి రక్షిస్తుంది..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Jan 13, 2025 | 1:42 PM

ప్రస్తుత కాలంలో కాన్సర్ మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కాన్సర్ కేసుల సంఖ్య పెరగడంపై పరిశోధకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్‌ వ్యాప్తికి సరైన కారణం కోసం నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లు కాన్సర్ కి దారి తీస్తాయని మాత్రం అనేక సందర్భాల్లో నిపుణులు పేర్కొన్నారు. అయితే, పాలతో క్యాన్సర్‌ను ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

రోజూ ఒక గ్లాసు పాలు క్యాన్సర్ నుండి రక్షిస్తుంది..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Milk
Follow us on

పిల్లలు, పెద్దలు అనే తేడా లేదు..పాలు అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. దీని వినియోగం వల్ల అనేక రకాల సమస్యలు నయమవుతాయి. అందువల్ల, చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ గ్లాస్‌ పాలు తాగాలని పిల్లలతో సహా అన్ని వయసుల వారికి సలహా ఇస్తారు. మీరు మీ ఆహారంలో పాలను క్రమం తప్పకుండా చేర్చుకుంటే, అది మీ ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు నిరూపించాయి. అవును రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 20శాతం తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

రోజూ ఒక గ్లాసు పాలు క్యాన్సర్ నుండి కాపాడుతుంది..

ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలలో ఉండే కాల్షియం, ఇతర పోషకాలు పేగు గోడలను బలోపేతం చేస్తాయి. హానికరమైన మూలకాల ప్రభావాలను తగ్గిస్తాయి. దీనితో పాటు పాలలో ఉండే విటమిన్ డి శరీరంలోని కణాలను క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రేగు క్యాన్సర్‌కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ 200-250 మి.లీ పాలు ఆరోగ్యానికి చాలు అంటున్నారు. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఎముకలను బలపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

అయితే, పాలను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని పరిశోధకులు కూడా చెప్పారు. అధిక మొత్తంలో పాలు తాగడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయి పెరుగుతుంది. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి పాలను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.

అన్ని వయసుల వారు పాలను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు, మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ నుండి మాత్రమే కాకుండా అనేక ఇతర వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. అయితే, లాక్టోస్ అసహనంతో బాధపడుతున్న వ్యక్తులు పాలు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఇది కాకుండా, కొవ్వు రహిత పాలు, తక్కువ కొవ్వు పాలకు ప్రాధాన్యత ఇవ్వండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ న్యూస్ కోసం క్లిక్‌ చేయండి..