AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంతలా అందమైన మెరిసే చర్మం కావాలా..అయితే మీ డైట్ ప్లాన్ ఇలా మెయిన్ టెయిన్ చేయండి

ఏమాయ చేశావు సినిమాతో తెరంగేట్రం చేసి శాకుంతలం వరకూ, సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించి దూసుకెళ్తున్న అందాల ముద్దుగుమ్మ సమంత, ఈ భామకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

సమంతలా అందమైన మెరిసే చర్మం కావాలా..అయితే మీ డైట్ ప్లాన్ ఇలా మెయిన్ టెయిన్ చేయండి
Samantha
Madhavi
| Edited By: |

Updated on: Apr 29, 2023 | 9:15 AM

Share

ఏమాయ చేశావు సినిమాతో తెరంగేట్రం చేసి శాకుంతలం వరకూ, సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించి దూసుకెళ్తున్న అందాల ముద్దుగుమ్మ సమంత, ఈ భామకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ అమ్మడు అటు తెలుగు, తమిళం, కన్నడ, మళయాళంతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. అటు ఓటీటీ ప్లాట్ ఫాంలో కూడా సమంత తన సత్తా చాటుతోంది. అయితే ఈ అమ్మడు అటు తన సినిమా కెరీర్ తోనే కాదు అటు సోషల్ మీడియాలో కూడా సత్తా చాటింది. ముఖ్యంగా ఈ అమ్మడు తన ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది.

సమంత సాధారణంగా, బాలెన్స్ డైట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె ఫాస్టింగ్ లేదా ఉపవాసం చేయడంపై నమ్మకం లేదు. ఆమె ఎప్పుడూ భోజనం మానేయదు. మితంగా అన్నీ తినాలన్నది ఆమె మంత్రం. ఆమె ఆహారంలో ఎక్కువగా సలాడ్లు, పండ్లు, గింజలు, బెర్రీలు, కూరగాయలు, లీన్ మాంసం ఉంటాయి. ఆమె అన్నిరకాల ఆహారాన్ని ఇష్టపడుతుంది. తరచుగా ఆమెకు ఇష్టమైన వంటకాలు, వంటలలో మునిగిపోతుంది. ఆమె సుషీ, సాంబార్ రైస్, పాలకోవా తినడానికి ఇష్టపడుతుంది. సమంతకు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యత తెలుసు, కానీ ఆమె ఆదివారం నాడు చీట్ డైట్ చేస్తుంది. అంటే ఇష్టమైనవి తినేస్తుంది. వారంలో ఒక రోజు మాత్రం ఆమె బిర్యానీ, రొయ్యలు సహా చాలా మసాలా ఆహారాన్ని తింటుంది.

సమంత డైట్ ప్లాన్ ఇదే.సాధారణ సమంతా అక్కినేని డైట్ ప్లాన్ క్రింది విధంగా ఉంది:

బ్రేక్ ఫాస్ట్:

బ్రౌన్ బ్రెడ్, అవోకాడో, గుడ్లు

స్నాక్స్:

తాజా పండ్లు

లంచ్:

మిల్లెట్లతో చేప లేదా మటన్

స్నాక్స్ :

చిలగడదుంప లేదా గుడ్లు

డిన్నర్:

మిల్లెట్స్ తో కూరగాయ, లేదా చేప లేదా మటన్

సమంత అక్కినేని బ్యూటీ సీక్రెట్స్‌లో ఒకటి హైడ్రేషన్. సమంత రోజంతా తగినంత హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఇష్టపడుతుంది. మెరుగైన చర్మం, ఆరోగ్యానికి హైడ్రేషన్ కీలకమని ఆమె నమ్ముతుంది. ఆమె తన రోజువారీ దినచర్యలో కొబ్బరి నీరు, తాజా పండ్ల రసాలు, ఇతర పోషకాలు అధికంగా ఉండే పానీయాలను కూడా జోడిస్తుంది. సమంత అక్కినేని అందాల రహస్యాలలో ఎవరికీ తెలియనిది మీ కోసం. సమంత తన మెరిసే చర్మం క్రెడిట్ ఆపిల్ సైడర్ వెనిగర్‌కు ఇచ్చింది. ఆమె ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్‌ని కలుపుతుంది. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ త్రాగుతుంది. ఫలితం? అందమైన ప్రకాశవంతమైన చర్మం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..