
కాలం ఏదైనా సరే చర్మ రక్షణ చాలా ముఖ్యం. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అన్నది మీ చర్మమే చెబుతుంది. చర్మాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటేనే మీరు అంత అందంగా కనిపిస్తారు. అందులోనూ ఎండాకాలంలో చర్మానికి ఎక్స్‌ట్రా కేర్ కావాలి. కానీ చాలా మంది పట్టించుకోరు. దీని వల్ల చర్మం ట్యాన్ అయిపోవడం, మచ్చలు, మొటిమలు, మొటిమలతో అందవిహీనంగా కనిపిస్తుంది. కాబట్టి చర్మ పరంగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎండాకాలంలో వచ్చే సమస్యలని దూరం చేయడంలో పాల మీగడ చక్కగా పని చేస్తుంది. పాల మీద మీగడలో చర్మానికి అవసరం అయిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని తేమగా, కాంతివంతంగా తయారు చేస్తాయి. పాల మీగడలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో చర్మం హైడ్రేట్‌గా తయారవుతుంది.
చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో.. పాల మీగడ చక్కగా పని చేస్తుంది. రెగ్యులర్‌గా ముఖానికి పాల మీగడని అప్లై చేస్తే.. కొద్ది రోజుల్లోనే మీ ముఖంలో గ్లో అనేది వస్తుంది. అంతే కాకుండా స్కిన్‌పై దురద, బర్నింగ్ వంటి సమస్యలు దూరం చేసుకోవచ్చు.
చర్మంపై దుమ్ము, ధూళి అనేవి పేరుకుపోతూ ఉంటాయి. తరచుగా చర్మాన్ని క్లీన్ చేసుకోపోతే.. చర్మం కాంతి విహీనంగా తయారవుతుంది. కాబట్టి తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పాల మీగడలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంపై వచ్చే మంటను తగ్గిస్తాయి. అలాగే ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్‌ను తగ్గించి.. స్కిన్ మెరిచేలా చేస్తుంది.
పాల మీగడను తరచూ చర్మంపై రాస్తూ ఉంటే.. చర్మం డీటాక్సీఫై అవుతుంది. ముఖానికి పాల మీగడ రాసి.. మసాజ్ చేస్తే.. ముఖంపై పేరుకు పోయిన మురికి అనేది దూరం అవుతుంది. ఇది చర్మాన్ని డీటాక్సీఫై చేయడంలో సహాయ పడుతుంది. ముఖానికి పాల మీగడ రాసే ముందుగా ముఖాన్ని సుభ్రంగా కడుక్కోవాలి. ఆపై బాగా క్లీన్ చేసుకోవాలి. తరచూగా ఇలా చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా మెరిసి పోవడం ఖాయం.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..