AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Tea Side Effects: అతిగా గ్రీన్ టీ అలవాటుందా..? అయితే, జాగ్రత్త సుమీ..!

బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతారు. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. దీంతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కానీ,

Green Tea Side Effects: అతిగా గ్రీన్ టీ అలవాటుందా..? అయితే, జాగ్రత్త సుమీ..!
Jyothi Gadda
|

Updated on: Jan 14, 2023 | 4:02 PM

Share

అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడుతున్నవారు.. జిమ్‌లకు వెళ్తూ స్లిమ్‌గా ఉండాలని భావించేవారు ఈ రోజులుగా ఎక్కువగా ఉన్నారు. ఇవన్నీ ప్రస్తుతం కాలంలో ఆరోగ్యానికి కాపాడుకోవటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఈ రోజుల్లో బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీ తాగుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతారు. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. దీంతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కానీ, మోతాదుకు మించిన గ్రీన్ టీ అలవాటు ఉంటే మాత్రం కొన్ని దుష్పప్రభావాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ టీలో కెఫిన్ ఒక ముఖ్యమైన పదార్ధం. దీర్ఘకాలంగా గ్రీన్ టీ వాడుతున్న వ్యక్తులలో విశ్రాంతి లేకపోవడం, ఆందోళన, నిద్రలేమి వంటివి సమస్యలు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో, గ్రీన్ టీ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ సమ్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. అయితే, “యుఎస్ ఫార్మాకోపోయియా” జర్నల్‌లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం, గ్రీన్ టీ ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు మాత్రమే మన శరీరానికి విషపూరితం అవుతుందని, సరైన సమయంలో గ్రీన్‌ టీ తాగడం వల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందువల్ల, మీకు ఇప్పటికే కాలేయం బలహీనమైతే, గ్రీన్ టీ తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మీరు ఇప్పటికే కొన్ని మందులు, మూలికా ఔషధాలను వాడుతున్నట్టయితే,మీరు గ్రీన్ టీ తీసుకోవాల్సిన అవసరం ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించడం సురక్షితం. ఎందుకంటే గ్రీన్ టీ ఇతర మందులు లేదా మూలికా నివారణలతో రియాక్షన్‌ అయ్యే అవకాశం లేకపోలేదు.

ఇవి కూడా చదవండి

మీకు రక్తహీనత ఉంటే, గ్రీన్ టీ తాగకపోవడమే మంచిది. ఎందుకంటే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మన శరీరం ఆహారం నుండి తగినంత ఐరన్ పొందకుండా పూర్తిగా నిరోధిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

గ్రీన్ టీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అందువల్ల, డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ఇప్పటికే ప్రిస్క్రిప్షన్ డయాబెటిస్ ఔషధాలను తీసుకుంటే, మీరు తీసుకోవాల్సిన గ్రీన్ టీ గురించి మీ వైద్యుడిని అడగడం ఉత్తమం.

రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగడం వల్ల మీ శరీరం నుండి కాల్షియం తొలగిపోతుంది, ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది ఎముకల బలహీనతకు కారణమవుతుంది. అందువల్ల, గ్రీన్ టీని మితంగా తీసుకోవడం మంచిది.

గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగడం ప్రమాదకరం కాదు, కానీ గర్భిణీ స్త్రీలు ఈ పానీయాన్ని మితంగా మాత్రమే తాగాలి. ఎందుకంటే ఇందులో కెఫిన్ ఉంటుంది. కాబట్టి, గర్భిణీలు గ్రీన్ టీ తాగడానికి ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. గ్రీన్ టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దీన్ని పిల్లలకు ఇవ్వకపోవడమే మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..