Give Up Alcohol: నెల రోజులు మద్యం మానేస్తే శరీరంలో బోలెడు మార్పులు.. అవేంటో తెలిస్తే షాకవుతారు..

|

Jun 29, 2023 | 3:00 PM

అధికంగా మద్యాన్ని సేవిస్తే బరువు పెరగడం, మానసిక సమస్యలు, హృదయ సంబంధిత వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మద్యపానం చేసేవారిలో చాలామంది ధృడ సంకల్పంతో మద్యాన్ని వదిలేయాలని అనుకుంటూ ఉంటారు.

Give Up Alcohol: నెల రోజులు మద్యం మానేస్తే శరీరంలో బోలెడు మార్పులు.. అవేంటో తెలిస్తే షాకవుతారు..
Liquor Sale
Follow us on

మద్యపానం చేసే వారికి మద్యాన్ని వదిలిపెట్టడమంటే సాధ్యం కాదు. మొదట్లో సరదాగా స్టార్ట్ చేసే మద్యపానం క్రమేపి అలవాటుగా మారుతుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కొంతమంది మద్యపానాన్ని కంట్రోల్ చేయలేరు. అధికంగా మద్యాన్ని సేవిస్తే బరువు పెరగడం, మానసిక సమస్యలు, హృదయ సంబంధిత వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మద్యపానం చేసేవారిలో చాలామంది ధృడ సంకల్పంతో మద్యాన్ని వదిలేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఒక నెల, రెండు నెలల పాటు మద్యపానాన్ని వదిలేస్తూ ఉంటారు. అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని బట్టి ఒక నెల పాటు మద్యపానాన్ని వదిలేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరు ఎంత మద్యాన్ని సేవిస్తున్నారో? దానిని ప్రయోజనాలు మారుతూ ఉంటాయని పేర్కొంటున్నారు. ఓ నెల రోజుల పాటు మద్యాన్ని మానేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో? ఓ సారి తెలుసుకుందాం.

కాలేయ పనితీరు మెరుగు

అధికంగా మద్యాన్ని సేవిస్తే కాలేయ సిరోస్సిస్‌కు గురవుతారు. కాలేయ క్షీణతకు గురయ్యే సిరోస్సిస్ అనేది కాలక్రమేణ ఏర్పడే వ్యాధి. మీరు మద్యపానాన్ని మానేస్తే ఆ మార్పులు తిరిగి మారతాయి. ఆల్కహాల్ మానేసిన వారాల్లోనే కాలేయ పనితీరు మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యం పెంపు

మద్యాపానం ఓ నెలపాటు మానేస్తే గుండె పనితీరులో గణనీయమైన మార్పులు వస్తాయి. నివేదికల ప్రకారం ఆల్కహాల్ వినియోగం ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌కు కారణం అవుతుంది. ఇది ఆక్సీకరణ చెందినప్పుడు ధమనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. తద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ వినియోగించడం పరిమితం చేస్తే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యం మెరుగు అవుతుంది.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ ప్రమాదం తగ్గుదల

అనేక అధ్యయనాల ప్రకారం ఆల్కహాల్ వినియోగం క్యాన్సర్ సమస్యకు కారణంగా నిలుస్తుంది. క్యాన్సర్ మరణాల్లో దాదాపు 3.5 శాతం ఆల్కహాల్ సంబంధితమైనవిగా పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, కొలెరెక్టల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్లు మద్యపానం వల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మద్యపానాన్ని మానేస్తే క్యాన్సర్ ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు.

బరువు తగ్గుదల

ఆల్కహాల్ అనేది అధిక క్యాలరీలతో నిండి ఉంటుంది. కాబట్టి అధిక మద్యపానం బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. అయితే ఓ నెల రోజుల పాటు మద్యపానం మానేస్తే గణనీయమైన బరువు తగ్గుదల, శరీర కూర్పులో మెరుగుదల, పొట్ట భాగంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మొత్తం మీద బరువు గణనీయంగా తగ్గుతుంది.

మెదడు శక్తి మెరుగు

మితిమీరిన ఆల్కహాల్ వినియోగం మతిమరుపు సమస్యను పెంచుతుంది. ముఖ్యంగా ఏకాగ్రతను దెబ్బతీసే నిర్దిష్ట మెదడు రుగ్మతలను అభివృద్ధి అవుతాయి. ఆల్కహాల్ వినియోగం మెదడును డోపమైన్‌తో ఓవర్‌లోడ్ చేస్తుంది. అయితే మద్యపాన వినియోగాన్ని తగ్గిస్తే డోపమైన్‌ను తగ్గిస్తుంది. తద్వారా మెదడు మరింత శక్తివంతంగా తయారవుతుంది. 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..