Drinking Tea: భోజనం చేసిన వెంటనే టీ తాగుతున్నారా.? అయితే జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!

|

Aug 06, 2021 | 11:15 AM

టిఫిన్ లేదా భోజనం చేసిన తర్వాత టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ అలవాటు మీకు గానీ, మీ స్నేహితుల్లో ఎవరికైనా...

Drinking Tea: భోజనం చేసిన వెంటనే టీ తాగుతున్నారా.? అయితే జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!
Tea
Follow us on

టిఫిన్ లేదా భోజనం చేసిన తర్వాత టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ అలవాటు మీకు గానీ, మీ స్నేహితుల్లో ఎవరికైనా ఉంటే వెంటనే మానేయండి. ఆహరం తిన్న వెంటనే టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. భోజనం చేసిన తర్వాత ఎన్ని గంటలకు టీ తాగాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

భోజనం తర్వాత 1 గంట పాటు…

మీరు భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీని 1 గంట అనంతరం తాగాలి. ఆహారం తీసుకున్న తర్వాత 1 గంటలోపు శరీరం ఆహారంలోని ఐరన్ పోషకాలను గ్రహిస్తుంది. ఒకవేళ అదే సమయంలో మీరు టీ తాగితే.. జీర్ణ క్రియపై దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి భోజనం సమయంలో లేదా తర్వాత టీ తాగడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చునని వైద్యులు అంటుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సరిగ్గా ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. కానీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో అన్ని రకాల టీలు ఇందుకు ప్రయోజనకరంగా ఉండవని స్పష్టమైంది.

గ్రీన్ టీ, హెర్బల్ టీ మంచిది…

యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ అధికంగా ఉండే గ్రీన్ టీ, అల్లం టీలు మన జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. అవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పని చేయడమే కాకుండా జీర్ణక్రియకు సంబంధించిన అనేక లోపాలను సరి చేస్తాయి. గ్రీన్ టీలో ఉండే క్యాట్‌కిన్ అనే పాలీఫెనోలిక్ జీర్ణవ్యవస్థలో ఉండే ఎంజైమ్‌లు, ఆమ్లాల సామర్థ్యాన్ని పెంచుతుంది. టిఫిన్ లేదా భోజనంతో పాటు మీరు టీ తాగాలనుకుంటే.. ఖచ్చితంగా ఐరన్, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారు భోజనంతో పాటు టీని తాగడం మంచిది కాదని వైద్యులు అంటున్నారు.

Also Read:

మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!

10 వేలకుపైగా పరుగులు, 1697 వికెట్లు.. ఈ దిగ్గజ క్రికెటర్ మామూలోడు కాదు.. అతడెవరో తెలుసా!