AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగ్రహంతో ఊగిపోతున్నారా..? ఇలా చేస్తే 2 నిమిషాల్లో మీ కోపం మొత్తం తగ్గిపోతుంది..హ్యాపీగా ఉంటారు..

మనుషులుగా మనందరికీ ఎప్పుడో ఒకసారి కోపం తప్పక వస్తుంది. అది రావాల్సిందే కూడా.. ఎందుకంటే అదొక సహజమైన ఆరోగ్యకరమైన భావోద్వేగం. ఈ కోపం వెనుక అనేక కారణాలు ఉంటాయి. ఎప్పుడు ఏ విషయంలో మనిషికి కోపం వస్తుందో చెప్పటం కష్టమే. కానీ, సందర్భాన్ని బట్టి మన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, కోపంలో అనే మాటలు, చేసే పనులు ఎదుటి వారిని బాధపెట్టడంతో పాటు అనేక అనర్థాలు, తీవ్ర నష్టాలను కలిగిస్తాయి. అందుకు కోపాన్ని ఎప్పటికప్పుడు కంట్రలో చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే.. మీ కోపం ఇట్టే పోతుంది. హ్యాపీగా ఉంటారు..

ఆగ్రహంతో ఊగిపోతున్నారా..? ఇలా చేస్తే 2 నిమిషాల్లో మీ కోపం మొత్తం తగ్గిపోతుంది..హ్యాపీగా ఉంటారు..
Anger
Jyothi Gadda
|

Updated on: May 08, 2025 | 2:10 PM

Share

మనుషులుగా మనందరికీ ఎప్పుడో ఒకసారి కోపం తప్పక వస్తుంది. అది రావాల్సిందే కూడా.. ఎందుకంటే అదొక సహజమైన ఆరోగ్యకరమైన భావోద్వేగం. ఈ కోపం వెనుక అనేక కారణాలు ఉంటాయి. ఎప్పుడు ఏ విషయంలో మనిషికి కోపం వస్తుందో చెప్పటం కష్టమే. కానీ, సందర్భాన్ని బట్టి మన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, కోపంలో అనే మాటలు, చేసే పనులు ఎదుటి వారిని బాధపెట్టడంతో పాటు అనేక అనర్థాలు, తీవ్ర నష్టాలను కలిగిస్తాయి. అందుకు కోపాన్ని ఎప్పటికప్పుడు కంట్రలో చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే.. మీ కోపం ఇట్టే పోతుంది. హ్యాపీగా ఉంటారు..

కోపం వచ్చినప్పుడు మనిషి సహజంగానే చాలా విషయాల్లో నియంత్రణ కోల్పోతాడు. మీరు కూడా కోపంగా ఉన్నప్పుడు ముక్కు ద్వారా గాలి పీల్చుకుని నోటి ద్వారా నెమ్మదిగా వదలండి. ఇది మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. కోపాన్ని తగ్గిస్తుంది. దీంతో మీరు తిరిగి ప్రశాంతంగా ఉంటారు.

చల్లని నీరు తాగండి: కోపంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు చల్లటి నీరు తాగటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే చల్లని నీరు శరీర ఉష్ణోగ్రతను, మనసును కూల్ చేస్తుంది. దీంతో కోపం కంట్రోల్‌ అవుతుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మౌనంగా ఉండండి: కోపంలో మాట్లాడితే సంబంధాలు చెడిపోతాయి. మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కోపం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కోపంలో మాట్లాడే కంటే.. రెండు నిమిషాలు మౌనంగా ఉండటం ఉత్తమం. మౌనం మనసుకు ప్రశాంతతనిస్తుంది.

స్థలాన్ని మార్చుకోండి: ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో మీకు కోపం వస్తే.. అక్కడ్నుంచి తప్పుకోండి. తప్పులేదు. కోపం ఉన్న చోట ఉండకుండా వేరే చోటికి వెళ్ళటం వల్ల కాస్త కోపం కంట్రోల్‌ అవుతుంది. కాసేపు బయటకు వెళ్లి నడవండి.

మొబైల్ చూడండి: కోపంగా ఉన్నప్పుడు ఏదైనా ఆహ్లాదకరమైనది చూడండి..కోపం తగ్గించుకోవడానికి ఫన్నీ వీడియోలు చూడండి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, కోపం తగ్గుతుంది. కాస్త మనసు కుదుట పడుతుంది.

మీతో మీరు మాట్లాడుకోండి: చాలా మంది కోపంలో విచక్షణ కోల్పోయి మాట్లాడుతుంటారు. అలాంటి మాటలతో ఎదుటి వారిని బాధపెట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు. అందుకే కోపంగా ఉన్నప్పుడు అద్దంలో మీతో మీరు మాట్లాడుకుని, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!