Polished Rice: పాలిష్‌ చేసిన బియ్యం తింటే ఇంత ప్రమాదమా..? తప్పక తెలుసుకోండి..

ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మందికి బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. ఎన్ని రకాల ఆహారాలు తిన్నప్పటికీ, అన్నం తిన్నట్టుగా ఉండదు ఎక్కువ మందికి . అయితే బియ్యం అన్నగానే, అంద‌రికీ తెల్ల‌గా పాలిష్ చేసిన బియ్య‌మే గుర్తుకు వస్తుంది. బియ్యాన్ని యంత్రాల్లో అనేక మార్లు పాలిష్ చేసి మీద ఉండే పొట్టును పూర్తిగా తొలగించేస్తారు. దీంతో బియ్యం తెల్ల‌గా మారి మెరుస్తుంది. అయితే, వాస్త‌వానికి ఇలా పాలిష్ చేసిన బియ్యాన్ని తిన‌డం మంచిది కాద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. పాలిష్‌ చేసిన బియ్యం తినటం వల్ల కలిగే నష్టాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Polished Rice: పాలిష్‌ చేసిన బియ్యం తింటే ఇంత ప్రమాదమా..? తప్పక తెలుసుకోండి..
Polished Rice

Updated on: Nov 25, 2025 | 8:24 AM

పాలిష్‌ చేసిన బియ్యం తినడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ బి1 (థయామిన్) అందదు. దీంతో బెరిబెరి వ్యాధి వస్తుంది. దీంతో నాడీ వ్యవస్థ, గుండె పనితీరు మందగిస్తుంది. పాలిష్ చేసిన బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి. తద్వారా ఈ బియ్యం ఎక్కువగా తింటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. పాలిష్ బియ్యంలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా సరిగా జీర్ణం కాదు. దీంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

పాలిష్ బియ్యం తింటే ఆకలి ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఫైబర్ లోపించడం వల్ల ఎంత తిన్నా కడుపు నిండినట్లుగా ఉండదు. దీంతో ఆకలి ఎక్కువగా ఉంటుంది. దీంతో జంక్ ఫుడ్ తిని బరువు పెరుగుతారు. పైగా, పాలిష్ చేసిన బియ్యంలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి కీళ్లకు సరైన పోషణ అందించవు. తద్వారా కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. పాలిష్ బియ్యం రెగ్యులర్‌గా తినేవారిలో కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు ఇదే కొనసాగితే చేతులు, కాళ్లు స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉంది.

పాలిష్ బియ్యం తింటే శరీర బలానికి కావాల్సిన పోషకాలు సరిగా అందవు. దీంతో నడవడంలో ఇబ్బందిగా ఉంటుంది. నాడీ వ్యవస్థ, కండరాల కదలికలు మందగిస్తాయి. పాలిష్ చేసిన బియ్యం ఎక్కువగా తింటే మానసిక ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. సరైన పోషణ అందక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. పాలిష్ చేసిన బియ్యం ఎక్కువగా తింటే శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. బాడీలో ఇంఫ్లమేషన్ పెరగడం వల్ల ఇలా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..