Idli vs Dosa: ఇడ్లీ వర్సెస్ దోశ.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్‌.. నిపుణులు సజెస్ట్ చేసేది ఏది?

తెలుగురాష్ట్రాల్లోని ప్రజలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎక్కవగా తినే టిఫిన్స్‌లో ఇడ్లీ, దోశ టాప్‌లో ఉంటాయి. ఇవి రెండు పులియపెట్టడం, బియ్యం, పప్పులతో చేసినప్పటికీ వాటి ప్రయోజనాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అయితే బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెండింటిలో ఏది మంచిదో మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Idli vs Dosa: ఇడ్లీ వర్సెస్ దోశ.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్‌.. నిపుణులు సజెస్ట్ చేసేది ఏది?
Idli Vs Dosa For Weight Loss

Updated on: Jun 12, 2026 | 4:25 PM

ఈ మధ్య చాలా మంది బరువు తగ్గి స్లిమ్ అవ్వాలని చూస్తున్నారు. ఇందుకోసం జిమ్‌కు వెళ్లడం డైట్ ఫాలో అవ్వడం చేస్తున్నారు. అయితే డైట్‌లో ఎలాంటి ఆహారం తీసుకుంటామనేది కూడా మనకు చాలా ముఖ్యం. డైట్‌లో భాగంగా చాలా మంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ లేదా దోశను తింటుంటారు. కానీ వెయిట్ లాస్‌లో ఉన్నవారికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయానికి వస్తే.. మొదటగా రెండింటిలో క్యాలరీలను పోల్చుకోవాల్సి ఉంటుంది.

క్యాలరీల పరంగా ఏది బెస్ట్

ఎందుకంటే బరువు నియంత్రణలో క్యాలరీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇడ్లీ, దోశలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసుకోవాలి. అంటే 40–50 గ్రాములు ఇడ్లీలో సుమారు 39 నుంచి 45 క్యాలరీలు ఉంటాయి. అదే 80 నుంచి 100 గ్రాముల ప్లెయిన్ దోశలో 120 నుంచి 150 క్యాలరీలు ఉంటాయి. దొశతో పోల్చుకుంటే ఇడ్లీలలో ఎందుకు కేలరీలు తక్కువగా ఉంటాయంటే.. వీటిని ఆవిరిపై ఉడికిస్తారు కాబట్టి వాటిలో అస్సలు నూనె ఉండదు. కానీ దోశలను పెనంపై కాల్చడానికి నూనె లేదా నెయ్యి వాడుతుంటారు. కాబట్టి తక్కువ క్యాలరీలు కోరుకునే వారికి ఇడ్లీ మంచి ఎంపిక.

ఇడ్ల, దోశలోని పోషకాలు

రెండూ ఒకే పిండితో చేయడం వల్ల వీటిలో లభించే పోషకాల శాతం దాదాపు ఒకేలా ఉంటుంది. వీటిలో 2 నుంచి 3 గ్రాముల ప్రోటిన్, 8-15 గ్రాములు కార్బోహ్రేట్, తక్కవ ఫైబర్ ఉంటుంది. ఒక వేళ బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయడానికి మీరు పిండిలో ఓట్స్, రాగులు, క్వినోవా లేదా ఎక్కువ పప్పులను యాడ్ చేసుకోవచ్చు.

బరువు తగ్గడానికి ఉత్తమైన బ్రేక్‌ఫాస్ట్‌

రాగి ఇడ్లీ, దోశ: త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి రాగి ఇడ్లీ లేదా రాగి దోశ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, క్యాల్షియం ఎక్కువగా ఉండి ఆకలిని నియంత్రిస్తుంది. త్వద్వారా మీరు ఎక్కవ తినవలసిన అవసరం ఉండదు.

ఓట్స్ ఇడ్లీ: ఇది కూడా వెయిట్ లాస్‌లో ఉన్న వారికి మంచి ఎంపిక ఇది మన జీర్ణక్రియకు మంచిది, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది

పెసరట్టు: ప్రోటీన్ ఎక్కువగా, కార్బ్స్ తక్కువగా ఉండే అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ కూడా బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.

బ్రౌన్ రైస్ ఇడ్లీ: రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తుంది. అలాగే త్వరగా ఆకలి వేయకుండా ఎక్కవ సేపు కడుపు నిండి భావాన్ని ఇస్తుంది.

ఇడ్లీ వర్సెస్ దోశ బరువు తగ్గేందుకు ఏది బెటర్?

మీరు కచ్చితంగా త్వరగా బరువు తగ్గాలి అనుకుంటే మీకు ఇడ్లీనే బెస్ట్ ఆప్షన్.ఎందుకంటే ఇందులో క్యాలరీలు చాలా తక్కువ, అలాగే నూనె అస్సలు ఉండదు. అయినప్పటికీ, దోశను కూడా తక్కువ నూనెతో కాల్చి, ఎక్కువ కూరగాయలు ఉన్న సాంబార్ లేదా ప్రొటీన్ ఉండే చట్నీలతో తింటే అది కూడా బ్యాలెన్స్‌డ్ డైట్ అవుతుంది. ముఖ్యంగా మీరు తినే పరిమాణంపైనే మీ బరువు తగ్గడం ఆధారపడి ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us