Relationship: భార్యాభర్తలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే విడాకులే..!

|

Apr 01, 2022 | 4:28 PM

Relationship: భార్యా భర్తల మధ్య బంధం బాగుంటేనే వారు చిరకాలం కొనసాగుతారు. లేదంటే చిన్న చిన్న విషయాలకే విడిపోవాల్సి ఉంటుంది.

Relationship: భార్యాభర్తలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే విడాకులే..!
Husbands And Wives
Follow us on

Relationship: భార్యా భర్తల మధ్య బంధం బాగుంటేనే వారు చిరకాలం కొనసాగుతారు. లేదంటే
చిన్న చిన్న విషయాలకే విడిపోవాల్సి ఉంటుంది. వివాహం తర్వాత జంటల మధ్య గొడవలు రావడం
సహజం. అలా అని గొడవ పడితే మొదటికే మోసం జరుగుతుంది. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే
స్వభావం ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలి.
అలా కాకుండా పంతాలకు పోతే విడాకులు తీసుకునేవరకు వెళుతుంది. నిజానికి అందరు జంటలు
తప్పు చేస్తారు కానీ సర్దుకొని పోతే జీవితం హాయిగా ఉంటుంది. అయితే అలాంటి గొడవలు మళ్లీ
మళ్లీ రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలు ఈ తప్పులని
ఎక్కువగా చేస్తారు. అలా చేయడం మంచిది కాదు. ఈ విషయాలు కచ్చితంగా గుర్తుపెట్టుకొని
మెలగండి. ఎటువంటి సమస్యలు ఉండవు.

1. పెళ్లికాకముందు ఉండే జీవితం పెళ్లయిన తర్వాత ఉండదు. చాలా మార్పులు సంభవిస్తాయి.
కొత్తగా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్లతో సమయాన్ని గడుపుతూనే మీ పార్టనర్‌కి
కూడా కొంచెం సమయం కేటాయించాలి. లేదంటే మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే
విధంగా పెళ్లి తర్వాత నేను అనకుండా మేము మనము అనుకుంటూ ఉండాలి.

2. జీవితంలో తప్పులు చేయకుండా ఎవరూ ఉండరు. అలాగని నా భార్య లేదా భర్త ఎప్పుడు
తప్పుచేయరని భావించుకోవడం మంచిది కాదు. ఎందుకంటే జీవితంలో ఎన్నో సంఘటనలు
జరుగుతాయి. సందర్భానికి తగిన విధంగా మారాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో తప్పులు
చేయడం సహజం. అలాంటి సమయంలో దంపతులు పంతాలకు పోకుండా కూర్చొని మాట్లాడుకొని
సమస్య పరిష్కారం చేసుకోవాలి. అప్పుడే ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది.

3. పెళ్లికాకముందు స్నేహితులతో ఎక్కువగా గడపడం చేస్తారు. కానీ పెళ్లయిన తర్వాత తగ్గిస్తారు.
ఇది మంచి పద్దతి కాదు. సరదాగా వారితో పాటు గడపడం మంచిది. ఒక రోజు ప్లాన్ చేసుకుని
అందరిని కలవండి. అంతే కానీ స్నేహితులతో మాట్లాడడానికి అవ్వలేదు. వారితో సమయాన్ని
గడపడం అవ్వలేదు అని ఆ ప్రస్టేషన్ మీ పార్ట్నర్ మీద చూపించొద్దు. ఇది పెద్ద సమస్యగా
మారుతుంది. అందరితో గడపటానికి సమయం మీరే కేటాయించుకోవాలి.

4. అలాగే కొంతమంది పెళ్లయిన తర్వాత కూడా తన వస్తువులని పార్ట్‌నర్‌ ముట్టుకోకూడదని
కండీషన్ పెడుతారు. ఇది మంచి పద్దతి కాదు. ఏవైనా సరే ఇద్దరు షేర్ చేసుకోవాలి. లేదంటే చిన్న
చిన్న గొడవలు పెద్దగా మారుతాయి. మీకు నచ్చినట్లు మీరు ఉండాలి. కొన్ని కొన్ని సార్లు త్యాగం
చేయడం కూడా మంచిదే. అప్పుడే ఎదుటివారిపై మీ ప్రేమ అనేది వ్యక్తం అవుతుంది.

Cricket Photos: ఇమ్రాన్‌ ఖాన్ రికార్డుని బద్దలు కొట్టిన బాబర్‌ ఆజం..

Health Tips: ఆహారంలో 3 రకాల కొవ్వులు ఉంటాయి.. అందులో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసా..!

Peanuts Benfits: ఎండాకాలం వేరుశెనగ గింజలు నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు..!